Asianet News TeluguAsianet News Telugu

ఆకట్టుకుంటున్న ‘రంగ రంగ వైభవంగా’ట్రైలర్.. పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్న యంగ్ హీరో వైష్ణవ్ తేజ్..

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ - గ్లామర్ బ్యూటీ కేతికా శర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫిల్మ్ ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). తాజాగా రిలీజ్ అయిన చిత్ర థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.  

Ranga Ranga Vaibhavanga Movie trailer Impressive, Vaishnav Tej super performance
Author
Hyderabad, First Published Aug 23, 2022, 7:42 PM IST

‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మెగా హీరో, పంజా వైష్ణవ్ తేజ్  (Vaishnav Tej) తదుపరి చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వైష్ణవ్ తేజ్ - యంగ్ బ్యూటీ కేతికా శర్మ జంటగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది.  ఈసందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్స్ ను వదులుతూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా థియేట్రికల్ ట్రైలర్ (Trailer)ను లాంఛ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

హీరోహీరోయిన్ చిన్నప్పుడు ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకునే సీన్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. కట్ చేస్తే.. పెద్దయ్యాక కూడా వీరిద్దరి మధ్య ఇదే తరహాలో గొడవలు జరుగుతుంటాయి. ఒకరంటే ఒకరికీ ఏమాత్రం పడదని అర్థమవుతోంది. నిత్యం పోట్లాడే వారిద్దరూ ఎలా ఒకటవుతారు.. అలాంటి సందర్భాన్ని ఎలా క్రియేట్ చేశారు. హీరోయిన్ ను చిక్కులకు కారణం ఏంటీ.. వైష్ణవ్ ఎలా పోరాడనే విషయాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అలాగే వైష్ణవ్ తేజ్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సినిమాలో కొత్త వైష్ణవ్ ను చూడొచ్చని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఫుల్ ఫన్ మరియు యాక్షన్, సెంటిమెంట్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆడియెన్స్ నుంచి ట్రైలర్ మంచి  రెస్పాన్స్ లభిస్తోంది. 

చివరిగా వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ జంటగా ‘కొండపొలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో వైష్ణవ్ ‘రంగ రంగ వైభవంగా’పై  ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే చిత్రం నుంచి వచ్చే అప్డేట్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. చిత్రానికి ఆదిత్య వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం చివరిగా సెప్టెంబర్ 2న డేట్ లాక్ చేసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios