Asianet News TeluguAsianet News Telugu

#Animal ఎలక్షన్ రిజల్ట్స్ హంగామా, అయినా సరే...

ఇది రన్బీర్ కపూర్ వన్ మ్యాన్ షో, రాక్ స్టార్, సంజులని మించిన నటనను ప్రదర్శించడానికి ఇందులో స్కోప్ దక్కింది. ఒకరకంగా చెప్పాలంటే ఆడేసుకున్నాడు. 

Ranbir movie Animal storm irrespective of elections results jsp
Author
First Published Dec 3, 2023, 1:58 PM IST


బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌బీర్ - తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్ర‌మే... ‘యానిమ‌ల్‌ (Animal movie).ట్రైలర్ తో ఈ సినిమా మ‌రిన్ని అంచ‌నాల్ని, ఆస‌క్తిని రేకెత్తించింది.మొన్న శుక్రవారం  డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమా తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.  ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 116 కోట్లు రాబట్టింది. బాలీవుడ్‌లో ఈ ఏడాదిలో విడుదలైన జవాన్‌, పఠాన్‌ చిత్రాల తర్వాత యానిమల్‌ కలెక్షన్స్‌ ఉన్నాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన  ఈ చిత్రం అన్నీ థియేటర్‌లల్లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతుంది. రెండో రోజు కూడా యానిమల్‌ కలెక్షన్స్‌ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో మొదటి రెండు రోజులు కలుపుకుని రూ. 236 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. 

ఇక మూడో రోజు ఈ చిత్రం తెలంగాణాలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. దాంతో కలెక్షన్స్ అక్కడ నైజాంలో ఎలా ఉంటాయనే ఆసక్తి ట్రేడ్ లో మొదలైంది. అందుతున్న సమాచారం మేరకు..ఎలక్షన్స్ గొడవ దానిదే..సినిమా గొడవ సినిమాదే అన్నట్లు థియేటర్స్ ని హైస్ ఫుల్ చేసేసారు. హైదరాబాద్ లో ఇవాళ కూడా ఉదయం ఏడు ఎనిమిది గంటల షోలు హౌస్ ఫుల్ తో రన్ అవుతున్నాయి. ప్రధాన కేంద్రాలతో పాటు బి, సి సెంటర్స్ లోనూ అదే సిట్యువేషన్ ఉంది. ఆదివారం కావడంతో ఎలక్షన్స్ రిజల్ట్స్ ని సెల్ ఫోన్ లో అయినా చూసుకోవచ్చు అన్నట్లుగా... థియేటర్లన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ అయ్యిపోయాయి. 

ఇక ఈ చిత్రం ఫస్టాఫ్, ముఖ్యంగా ఇంట్రవెల్ అదిరిపోయింది..దానికి డబ్బులు ఇచ్చి వచ్చేయవచ్చు అంటున్నారు రణ్‌బీర్‌ను సందీప్‌ ఎంత వైల్డ్‌గా చూపించారనేదే హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై పెరిగిన ఎక్సపెక్టేషన్స్ కు తగినట్లుగా ఫస్ట్ డే ఓపినింగ్స్ సునామీలా వచ్చాయి.

 మొదటిరోజే సగానికి పైగా షేర్ రూపంలో రాబట్టిన యానిమల్ కేవలం మూడు రోజులకే ఇంత పెద్ద ఫిగర్లు నమోదు చేయడం ఊహించని పరిమాణం. 15 కోట్లకు కొన్న దిల్ రాజుని మొదట రిస్క్ అనుకున్నారు కానీ ఇప్పుడాయనకు రాబోయే లాభాలు చూస్తే అందరికీ షాక్ ఇస్తోంది.
 
సాధారణంగా మాస్ సినిమాలకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బుకింగ్స్ బావుంటాయి. 'యానిమల్'కు మల్టీప్లెక్స్ థియేటర్లలో సైతం బావున్నాయి. పీవీఆర్, ఐనాక్స్ స్క్రీన్లలో రెండున్నర లక్షల టికెట్స్ అమ్మారు. కేవలం వాటి ద్వారా సుమారు ఏడున్నర కోట్ల వరకు వచ్చాయి.  ఒక్క హైదరాబాద్ సిటీలో ఫస్ట్ డే కలెక్షన్స్ మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉంటాయని టాక్. 

ఇక  యానిమల్ కు డివైడ్ టాక్  కనిపిస్తోంది.  కొంతమందికి పిచ్చ పిచ్చ నచ్చేయగా మరికొందరు సెకండ్ హాఫ్ కంప్లయింట్   చెప్తున్నారు.టాక్  ఎలా ఉన్నా వీకెండ్ మూడు రోజులు భీబత్సం సృష్టిస్తోంది. నిన్నైతే దేశవ్యాప్తంగా చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని సెంటర్లలోనూ  ఓపెనింగ్స్ భీభత్సంగా వచ్చాయి.   తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఫిగర్లు నమోదు అయ్యాయి. సందీప్ వంగా తెలుగువాడు అవటంతో హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫాస్ట్ అదిరిపోయాయి.
 
 యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios