Asianet News TeluguAsianet News Telugu

‘యానిమల్’ టీమ్ కు షాక్.. షూటింగ్ స్పాట్ నుంచి వీడియోలు.. రన్బీర్ లుక్ మాములుగా లేదుగా!

‘యానిమల్’ మూవీ షూటింగ్  శరవేగంగా కొనసాగుతోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తుండగా.. రన్బీర్ కపూర్ - రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని వీడియోలు లీకై వైరల్ అవుతున్నాయి. 
 

Ranbir Kapoors Animal movie shooting videos going viral!
Author
First Published Jan 28, 2023, 2:27 PM IST

‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) క్రేజీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెరిగిపోయాయి. ఈసారి మరింత వైలెన్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు కనిపిస్తోంది. 

ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేయడంతో సినిమా షూటింగ్ ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. మూవీని చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్న టీమ్ కు షాక్ తగిలింది. షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని వీడియోలు, ఫుటేజీలు లీకై నెట్టింట వైరల్ అవుతున్నాయి. రన్బీర్ గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. 

వీడియోలో.. ఓ ప్యాలెస్ లో రన్బీర్ కపూర్ తన గ్యాంగ్ తో ఖరీదైన కార్లతో కనిపిస్తాడు. కార్లలో తీసుకొచ్చిన గన్స్ ను బయటికి తీసి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటారు. రన్బీర్ అటిట్యూడ్, అట్రాక్టివ్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ లీక్ లతో సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనని అంచనాలు పెంచేస్తున్నారు.  ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయనున్నారు. టీ-సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.  ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios