‘బాహుబలి’ని అనుకరించే ప్రయత్నంలో కరణ్ మల్హోత్రా కథ,కథనం పట్టించుకోలేదని, అందుకే సినిమాలో ఏదీ ఆకట్టుకోలేదని అంటున్నారు. తెలుగులోనూ ఈ సినిమాకు మినిమం ఓపినింగ్స్ దక్కలేదు.
రణ్‌బీర్ కపూర్ తన పంథా మార్చి తొలిసారి నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘షంషేరా’. కరణ్ మల్హోత్రా దర్శకుడు. వాణీకపూర్ హీరోయిన్. సంజయ్‌దత్ విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజైన నాటి నుంచి బాహుబలి చిత్రంతో పోలిక తెచ్చారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి స్టార్ ప్రొడక్షన్ హౌస్ ...రూ.150 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా ఇది. ఈ నెల 22న హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైంది. అయితే ఈ సినిమా మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా లేవు లేవు. బాలీవుడ్లో మరో పెద్ద డిజాస్టర్‌గా ‘షంషేరా’ నిలవబోతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
గత పదేళ్లలో ఇంత బోరింగ్ సినిమా ఇంకోటి రాలేదని.. ఇదొక టార్చర్ మూవీ అని ట్విట్టర్ లో రాస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన చాలామంది క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలే ఇస్తున్నారు. మామూలు ప్రేక్షకుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా దారుణంగా ఉంది. ‘బాహుబలి’ని అనుకరించే ప్రయత్నంలో కరణ్ మల్హోత్రా కథ,కథనం పట్టించుకోలేదని, అందుకే సినిమాలో ఏదీ ఆకట్టుకోలేదని అంటున్నారు. తెలుగులోనూ ఈ సినిమాకు మినిమం ఓపినింగ్స్ దక్కలేదు. ఈ సినిమాని పట్టించుకున్న వాళ్లే కరువు అయ్యారు. భాక్సాపీస్ దగ్గర తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన థాంక్యూకే ఈ సినిమాకన్నా బెటర్ ఓపినింగ్స్ వచ్చాయి.
రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కెరీర్‌లో మొట్టమొదటిసారి ఈ రణ్‌బీర్ డబుల్ రోల్ చేసాడు. తండ్రి ‘షంషేరా’గా, కొడుకు ‘బల్లి’గా రణ్‌బీర్ నటించారు. దీంతో ఈ మూవీ అంచనాలు భారీగా పెరిగాయి. భారీగానే ఈ మూవీని ప్రమోట్ చేసారు టీమ్. అయినా ఫలితం కనపడలేదు. కొన్ని చోట్ల జనం ఇంటర్వెల్ లోనే వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. అప్పటికే అంత బోర్ అనిపించిందని చెప్తున్నారు.
‘షంషేరా’ కథ కల్పిత నగరమైన కాజాలో జరుగుతుంది. అక్కడ ఒక తెగకి చెందిన కొంతమంది యోధులని ఖైదు చేసి, అలాగే మిగిలిన వారిని బానిసలుగా చేసుకొని ఆఫీసర్ జనరల్ షుద్ సింగ్ హింసిస్తూ ఉంటాడు. ఇది బానిసగా మారిన ఓ వ్యక్తి నాయకుడిగా ఎదిగే కథ. అతను తన వాళ్ల స్వేచ్ఛ, గౌరవం కోసం చేసిన పోరాటమే ఈ చిత్రం. అతని పేరు షంషేరా. భారతదేశంలో 1800లలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా హై-ఆక్టేన్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరెక్కించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ చేసిన ‘షంషేరా’ వంటి పాత్రని ఇంతవరకు చేయలేదు. ఈ మూవీలో రణ్‌బీర్‌కి బద్ధ శత్రువుగా సంజయ్ దత్ నటించాడు.
