'అర్జున్ రెడ్డి' సినిమాతో సక్సెస్ అందుకున్న తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఓ డార్క్ క్రైమ్ స్టోరీ జోనర్ కి చెందిన కథను అప్పట్లో సందీప్.. మహేష్ కి వినిపించాడు. ఆ తరువాత చర్చలు ఆగిపోయాయి. ఇంతలో సందీప్ బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' సినిమాను తీసి సక్సెస్ అందుకున్నాడు.

అయినప్పటికీ మహేష్ తో సందీప్ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మహేష్ సినిమాను పక్కన పెట్టి మరో బాలీవుడ్ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అది కూడా మహేష్ కోసం రాసుకున్న కథతో అట.

రీసెంట్ గా రణబీర్, సందీప్ రెడ్డిల మధ్య కథాచర్చలు జరిగాయి. గతంలో మహేష్ కి చెప్పిన కథనే రణబీర్ కి వినిపించాడట. కథ నచ్చడంతో రణబీర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి 'డెవిల్' అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

నిజానికి 'కబీర్ సింగ్' తరువాత సందీప్ టాలీవుడ్ లోనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ అతడికి బాలీవుడ్ లో ఆఫర్లు రావడంతో అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాడు. పైగా ఈసారి తను బాలీవుడ్ లో తీసే సినిమా మరింత బోల్డ్ గా ఉంటుందని ముందే చెప్పాడు.