‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న మూవీయే ఈ ‘యానిమల్’.

సందీప్ రెడ్డి వంగా కు ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆయన దర్శకత్వంలో రూపొందే సినిమా అంటే అటు బాలీవుడ్, ఇటు టాలీవడ్ లోనూ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన నుంచి వస్తోన్న మూడో సినిమా ‘యానిమల్’ (Animal). బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీను ఆగస్టు 11 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ‘యానిమల్’ లవర్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది మూవీ టీమ్. గతంలో ఇచ్చిన మూవీ డేట్ ను క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రణబీర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాసం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే డిసెంబర్ రిలీజ్ ప ైనా మూవీ టీమ్ కు కూడా స్పష్టత లేనట్లు తెలుస్తోంది. అయితే ఇలా హఠాత్తుగా ఎందుకు రిలీజ్ డేట్ మార్చారు అనేది చర్చగా మారాయి. 

View post on Instagram


ఇక జనవరిలో విడుదలైన ‘యానిమల్’ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘యానిమల్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రణ్‌బీర్ కపూర్ లుక్ అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒళ్లంతా రక్తం, సంకలో రక్తంతో తడిసిన గొడ్డలి పెట్టుకుని సిగరెట్ వెలిగించుకుంటున్న రణ్‌బీర్ లుక్ చూసి కొందరు భయపడ్డారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత వైల్డ్‌గా రణ్‌బీర్ ఈ పోస్టర్‌లో కనిపించారు. సినిమా ఎలా ఉండబోతోందో ఈ ఒక్క పోస్టర్‌తో చెప్పేశారు దర్శకుడు సందీప్ వంగా.

 సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడే హీరో రణ్‌బీర్ కపూర్ భయపడ్డారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘యానిమల్ స్క్రిప్ట్ మొదటిసారి విన్నప్పుడు.. నాకు ఇంకా గుర్తుంది.. డైరెక్టర్ సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేయడం పూర్తికాగానే నేను నా బాత్‌రూంలోకి వెళ్లాను. నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. చాలా భయపడ్డాను. ఒక స్టోరీ, ఒక పాత్ర గురించి విని నేను భయపడటం ఇదే తొలిసారి. సినిమా చాలా బాగా వస్తోంది. సందీప్‌తో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇదొక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా. తండ్రీకొడుకుల ప్రేమకథ. ’ అని రణ్‌బీర్ కపూర్ వెల్లడించారు.

మొత్తానికి సందీప్ రెడ్డి వంగా చాలా గ్యాప్ తరవాత తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ఆడియన్స్‌కు మరో ఆసక్తికర సబ్జెక్ట్‌తో కిక్ ఇవ్వబోతున్నారు. అయితే, ‘యానిమల్’ కథను మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుకు సందీప్ చెప్పారట. అప్పుడు ‘డెవిల్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను రణ్‌బీర్ దగ్గరకు తీసుకెళ్లారు సందీప్. ఈ సినిమాను రణ్‌బీర్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, రష్మిక మందన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.