Asianet News TeluguAsianet News Telugu

#Animal:‘యానిమల్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ (అఫీషియల్)

యానిమల్  సినిమా రైట్స్ విషయమై కోర్టు కు ఎక్కటంతో ఓటిటి రిలీజ్ ఆగుతుందని అందరూ భావించారు. కానీ నెట్ ఫ్లిక్స్ వారు అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని ప్రకటించేసారు.

Ranbir Kapoor #Animal to release on OTT with extended cut jsp
Author
First Published Jan 21, 2024, 1:30 PM IST | Last Updated Jan 21, 2024, 1:30 PM IST


బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్ నటించిన సూపర్‌హిట్‌ మూవీ 'యానిమల్‌' ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. సందీప్‌ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌లో ఉన్నారు. జనవరి 26 నుంచి యానిమల్‌ స్ట్రీమింగ్‌ కానుందని నెట్టింట వార్తలు వైరల్‌ అయ్యాయి.

 అయితే అదే సమయంలో ఈ సినిమా రైట్స్ విషయమై కోర్టు కు ఎక్కటంతో ఓటిటి రిలీజ్ ఆగుతుందని అందరూ భావించారు. కానీ నెట్ ఫ్లిక్స్ వారు అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని ప్రకటించేసారు.   ‘యానిమల్’ డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ జనవరి 26న స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమౌతోంది. అలాగే ఎక్సటెండెడ్ వెర్షన్ తో ఓటిటి రిలీజ్ ఉండబోతోందని సమాచారం. 

Ranbir Kapoor #Animal to release on OTT with extended cut jsp


 
థియేటర్లలో కట్ అయిన కొన్ని సీన్స్‌ను ఓటీటీలో యాడ్ అవుతాయని తెగ  ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో రణబీర్ కపూర్, విలన్ బాబీ డియోల్ మధ్య ఇంటెన్స్ ఫైట్ సీన్ ఉంది. ఆ సీన్.. చాలామంది యాక్షన్ మూవీ లవర్స్‌ను కట్టిపడేసింది. అయితే ఆ సీన్ మధ్యలో బాబీ డియోల్.. రణబీర్ కపూర్‌ను ముద్దుపెట్టుకున్నానని, కానీ అది థియేటర్లలో విడుదల చేయలేదని, ఓటీటీ వర్షన్‌లో ఆ సీన్స్ ఉండే అవకాసం ఉందని సందీప్ బయిటపెట్టాడు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటికు రిలీజ్ డేట్ ఫిక్సైందనే వార్త ఫ్యాన్స్ ఆనందాన్ని కలగచేస్తోంది.  
 
డిజిటల్ వెర్షన్ లో కట్ చేయని ప్రింట్ ఇస్తానని సందీప్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అనటంతో... కనీసం పది నిమిషాలకు పైగా ఎక్స్ ట్రా ఫుటేజ్ ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.   యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే యూత్ కు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios