బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇప్పటికే కత్రినా కైఫ్, దీపిక పదుకొన్ వంటి స్టార్ హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపించారు. కత్రినా కైఫ్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి ఓ ఖరీదైన ఫ్లాట్ ని అద్దెకి తీసుకొని అక్కడే మకాం పెట్టారు.

కత్రినా ఆ ఫ్లాట్ ని ఎంతో ఇష్టంతో డెకరేట్ చేసుకునేది. పెళ్లి చేసుకొని అదే ఫ్లాట్ లో ఉండాలనుకున్నారు. కానీ ఇద్దరికి బ్రేకప్ అవ్వడంతో ఇక పెళ్లి ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు రణబీర్ కపూర్.. అలియా భట్ తో ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని పరోక్షంగా ఈ జంట చాలా సార్లు ఒప్పుకుంది. 

వీరి కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉండడంతో త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే చాన్స్ ఉందని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే గతంలో కత్రినాని ఫ్లాట్ లో పెట్టినట్లు ఇప్పుడు అలియాని ఓ హోటల్ రూమ్ లో పెట్టాడట రణబీర్ కపూర్.

ముంబైలో ఓ స్టార్ హోటల్ లో వీరిద్దరూ కలిసి ఉంటున్నారని బాలీవుడ్ మీడియా ప్రచురిస్తోంది. భారీగా అద్దె చెల్లిస్తూ అక్కడే మకాం పెట్టారని సమాచారం. మరి ఈ రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందో.. లేక ఎప్పటిలానే రణబీర్ బ్రేకప్ చెప్తాడో చూడాలి!