రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లకు పెళ్లి అయిపోయిందా..? వీరిద్దరికి సంబంధించిన ఫోటో చూస్తే ఈ అనుమానం రాక మానదు. అయితే ఇది నిజంగా వారి పెళ్లి ఫోటో కాదు.. ఓ వీరాభిమాని రూపొందించిన పోస్టర్.

వివరాల్లోకి వెళితే.. అలియా.. మోహే కలెక్షన్స్ అనే బ్రాండ్ రూపొందించిన కమర్షియల్ యాడ్ లో నటించింది. పెళ్లి కూతురిలా తయారై వరుడి మెడలో దండ వేస్తున్నట్లుగా ఆ యాడ్ ని రూపొందించారు. అయితే రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్ ఒకరు ఆ యాడ్ లో అలియాకు జోడీగా నటించిన వ్యక్తి ఫోటో స్థానంలో రణ్‌బీర్ ఫోటోని యాడ్ చేశారు.

దాంతో వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారని కొందరు నెటిజన్లు భావించారు. మరోపక్క రణ్‌బీర్, అలియాలు ప్రేమలో మునిగితేలుతున్నారు. కానీ ఈ విషయాన్ని  మాత్రం  బయటకి చెప్పడం లేదు.

ఇటీవల ఓ ఈవెంట్ ఫంక్షన్ లో అలియా స్టేజ్ మీద అందరి ముందు రణ్‌బీర్ కి ఐలవ్యూ చెప్పింది. ఆ సమయంలో రణ్‌బీర్ మురిసిపోయాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలైతే కానీ ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో క్లారిటీ రాదు.