అర్ధరాత్రి బాల్కనీలో హీరో, హీరోయిన్

ranbeer kapoor and alia bhatt have a late night dinner date
Highlights

బాలీవుడ్ హీరో రన్ బీర్ కపూర్ గత కొంతకాలంగా నటి అలియా భట్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడనే వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని రన్ బీర్ వద్ద ప్రస్తావించగా పరోక్షంగా తమ మధ్య రిలేషన్ ఉందనే విషయాన్ని వెల్లడించారు

బాలీవుడ్ హీరో రన్ బీర్ కపూర్ గత కొంతకాలంగా నటి అలియా భట్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడనే వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని రన్ బీర్ వద్ద ప్రస్తావించగా పరోక్షంగా తమ మధ్య రిలేషన్ ఉందనే విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ లో జరుగుతోన్న వేడుకలకు ఈ జంట కలిసి వెళ్లడం, రన్ బీర్ కుటుంబ సభ్యులతో అలియా ఎంతో సన్నిహితంగా మెలగడంతో వీరి మధ్య ప్రేమ నిజమేనని తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి అర్ధరాత్రి వేల బాల్కనీలో కలిసి ఉండడం కెమెరాకు చిక్కింది. దీంతో 
బాలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది.

రకరకాల కథనాలతో ఈ వార్తను ప్రచురించారు. అయితే వీరిద్దరూ లేట్ నైట్ కలిసి ఏం చేస్తున్నారనే విషయంలో స్పష్టత వచ్చింది. ఇటీవల రన్ బీర్ నటించిన 'సంజు' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సందర్భంగా తన స్నేహితులకు, సన్నిహితులకు పార్టీలు ఇస్తున్నాడు రన్ బీర్. ఈ క్రమంలో అలియా ఇంట్లో కూడా ఓ పార్టీ ఏర్పాటు చేశాడట. శుక్రవారం రాత్రి ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీలో అలియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారని సమాచారం. కానీ అలియా-రన్ బీర్ బాల్కనీలో ఏకాంతంగా గడపడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. 

loader