Asianet News TeluguAsianet News Telugu

‘అర‌ణ్య’ ఫస్ట్ డే కలెక్షన్స్ పరిస్దితి,అయ్యో అంటారు

బాహుబలి తర్వాత రకరకాల కారణాలతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు దగ్గుబాటి రానా. కేవలం నేనే రాజు నేనే మంత్రితో మెప్పించిన రానా ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడులో మాత్రమే దర్శనమిచ్చాడు. కథ నచ్చితే తన క్యారక్టర్ పరిథి గురించి ఆలోచించకుండా  ఓకే చెప్పే రానా చాలా కష్టపడి చేసిన చిత్రం అరణ్య. మల్టీ లాంగ్వేజ్ గా ఒకేసారి హిందీ తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ మీద అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి కారణంగా అక్కడ విడుదల వాయిదా వేసినా సౌత్ లో మాత్రం యథావిధిగా రిలీజ్ చేశారు. రంగ్ దేతో పోటీ పడిన అరణ్య ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ స్దాయి పరిస్దితి ఏంటో చెప్పేస్తున్నాయి.
 
Ranas Aranya has registered low openings on Day1  jsp
Author
Hyderabad, First Published Mar 27, 2021, 1:11 PM IST

బాహుబలి తర్వాత రకరకాల కారణాలతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు దగ్గుబాటి రానా. కేవలం నేనే రాజు నేనే మంత్రితో మెప్పించిన రానా ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడులో మాత్రమే దర్శనమిచ్చాడు. కథ నచ్చితే తన క్యారక్టర్ పరిథి గురించి ఆలోచించకుండా  ఓకే చెప్పే రానా చాలా కష్టపడి చేసిన చిత్రం అరణ్య. మల్టీ లాంగ్వేజ్ గా ఒకేసారి హిందీ తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ మీద అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి కారణంగా అక్కడ విడుదల వాయిదా వేసినా సౌత్ లో మాత్రం యథావిధిగా రిలీజ్ చేశారు. రంగ్ దేతో పోటీ పడిన అరణ్య ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ స్దాయి పరిస్దితి ఏంటో చెప్పేస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు అసలు ఓపినింగ్సే రాలేదు. మొదట రోజు కేవలం ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఆక్యుపెన్సీ  ఉంది. దానికి తోడు రివ్యూలు, మౌత్ టాక్ రెండూ డల్ గానే ఉన్నాయి. అప్పటికీ సోషల్ మీడియా జనాలకు స్పెషల్ షోలు వేసి  సినిమాకు బజ్ తెద్దామని ప్రయత్నం చేసారు. అయితే ఆ వ్యూహాలేమీ ఫలించలేదు. ఈ వీకెండ్ లో ఈ సినిమా జనాలను థియోటర్స్ కు రప్పించలేకపోతోంది. దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ వార్తలు భయపెట్టి జనాలను థియోటర్స్ వైపుకు వెళ్లకుండా చూస్తున్నాయి. యూత్ కూడా ఈ సినిమావైపు లుక్కేయటం లేదు. పూర్తిగా రానా భుజాల మీద మోసిన సినిమా ఇది. ఎక్కడా రొమాంటిక్ ట్రాక్, గ్లామర్ అప్పీల్ లేదు. దాంతో రానా స్వయంగా తనే బాధ్యత వహించి ప్రమోట్ కూడా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై క్రేజ్ క్రియేట్ కావటం లేదు. 

 అడ‌వులు... ఏనుగుల సంర‌క్ష‌ణ ఆవ‌శ్య‌క‌తని చాటి చెప్పే  క‌థ ఇది. నిజానికి ఇలాంటి క‌థ‌లు ఇదివ‌ర‌క‌టి సినిమాల్లోనూ చూసినా ప్రత్యేకంగా డిజైన్ చేసిన అర‌ణ్య పాత్ర‌, అట‌వీ నేప‌థ్యమే ఈ సినిమాని స్పెషల్ గా మార్చేసింది‌.  ముఖ్యంగా అర‌ణ్య‌కీ, ఏనుగులకీ మ‌ధ్య  అనుబంధాన్ని  తెర‌పై ఆవిష్క‌రించిన  తీరు...  ఆ కోణంలో ఎమోషన్స్ ని రాబ‌ట్టిన విధానం చిత్రానికి ప్ర‌ధాన ఎట్రాక్షన్‌. ఫస్ట్ సీన్  నుంచే అర‌ణ్య ప్ర‌పంచంలో ప్రేక్ష‌కుడిని భాగం చేశాడు ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌. ఆహ్లాదాన్ని పంచే  ప‌చ్చ‌టి అందాల్ని చూపెడుతూ క‌థ‌ని మొద‌లుపెట్టాడు.  అభివృద్ధి, ఉపాధి  పేరుతో  అడ‌వుల్ని నాశ‌నం చేస్తున్న విధానాన్ని క‌ళ్ల‌కు క‌ట్టే  ప్ర‌య‌త్నం చేశారు.  టౌన్‌షిప్ కాంట్రాక్ట‌ర్‌కీ, అర‌ణ్య‌కీ మ‌ధ్య  పోరాటం నేప‌థ్యంలోనే సినిమా సాగుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios