Asianet News TeluguAsianet News Telugu

ఎంత నష్టం? ‘రణ రంగం’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

ట్రేడ్ సమాచారం మేరకు ఈ చిత్రం ఆగస్టు 15 న రిలీజ్ అవటంతో ఆ రోజు శెలవు కలసొచ్చి 4 కోట్లు దాకా ఓపినింగ్స్ రాబట్టింది. శర్వానంద్ కెరీర్ లో ఇది హైయిస్ట్ ఓపినింగ్. కానీ దురదృష్టవశాత్తు సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే డిజాస్టర్ రిజల్ట్ తెచ్చేసుకుంది.  

Ranarangam had a poor first week
Author
Hyderabad, First Published Aug 22, 2019, 12:42 PM IST

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిన్‌ల కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల అయిన విషయం విదితమే. ఈ చిత్రం రిలీజ్ కు ముందు ఉన్న హైప్ తో ఓపినింగ్స్ బాగానే తెచ్చుకున్నా...టాక్ తేడాగా ఉండటంతో మాట్నీకే కలెక్షన్స్ డ్రాప్ అవటం స్టార్టైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఏ మేరకు ఫస్ట్ వీక్ కలెక్ట్ చేసింది అనేది ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్  పాయింట్ గా మారింది. 

ట్రేడ్ సమాచారం మేరకు ఈ చిత్రం ఆగస్టు 15 న రిలీజ్ అవటంతో ఆ రోజు శెలవు కలసొచ్చి 4 కోట్లు దాకా ఓపినింగ్స్ రాబట్టింది. శర్వానంద్ కెరీర్ లో ఇది హైయిస్ట్ ఓపినింగ్. కానీ దురదృష్టవశాత్తు సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే డిజాస్టర్ రిజల్ట్ తెచ్చేసుకుంది.  మొదటి వారంలో కేవలం 9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమా 17 కోట్లకు అమ్మారు. చాలా చోట్ల ఇప్పటికే తీసేసారు. దాదాపు పది సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమాని తీసేసి వాటికి దారిచ్చారు.  వచ్చే వారం సాహో వచ్చేదాకా కూడా ఈ సినిమా ఉండేటట్లు లేదు. దాంతో ఇంక ఈ మాత్రం కూడా కలెక్ట్ చేయటం కష్టమే అని తేలిపోయింది. అంటే దాదాపు ఆరేడు కోట్లు దాకా లాస్ వస్తుందని అంచనా వేస్తుందని అంచనా వేస్తున్నారు.

మాఫియా, గ్యాంగ్‌స్టర్‌ చిత్రాల్లో ‘గాడ్‌ ఫాదర్‌’ టాప్‌. ఆ సినిమా స్ఫూర్తితో ‘రణరంగం’ స్ర్కీన్‌ప్లే చేసారు. భూత, వర్తమానాలను చూపిస్తూ కొత్తగా తీశారని చెప్పారు కాని అది బోర్ కొట్టించింది. - ఎన్టీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మధ్యపాన నిషేధం విధించారు. అప్పటి పరిస్థితుల్లో, విశాఖ నేపథ్యంలో ఓ యువకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగితే ఎలా ఉంటుందని రాసిన కథతో చేసిన సినిమా ఇది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios