రానా నటనలో మరో కొత్త పర్వానికి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాడు. సినిమా సినిమాకు సరికొత్త గెటప్స్ లో దర్శనమిస్తున్న రానా ఇప్పుడు విరాట పర్వం అనే మరో సినిమాతో ప్రయోగానికి సిద్దమయ్యాడు. అది కూడా సాయి పల్లవితో రానా నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. 

ఇక సినిమా విషయానికి వస్తే.. నీది నాది ఒకే కథ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు అడుగుల వీరాటపర్వం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ రురల్ విలీజెస్ కి సంబందించిన పీరియడ్ డ్రామాగా సినిమను తెరపై చూపిస్తారట. మరి రానా - సాయి పల్లవి కాంబో ఎలా ఉంటుందో చూడాలి.