తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా, కాజల్ రానా సరసన కాజల్ నటిస్తున్న నేపథ్యంలో ఆసక్తి కరంగా మారిన రానా ట్వీట్ ఆ బిడ్డకు తల్లి కాజలేనంటూ ట్వీట్ చేసిన రానా దగ్గుబాటి
బాహుబలి-2 విడుదలై ఇన్ని రోజులైనా చాలా మంది అభిమానులు ఆ సినిమాలో సమాధానం లేకుండా మిగిలిన ప్రశ్నలను ఇంకా మరవలేకపోతున్నారు. 'బాహుబలి 2' చిత్రం విడుదలైన తర్వాత.... భల్లాలదేవుడి భార్య ఎవరు? తనకొడుకైన భద్రకు ఎవరి ద్వారా జన్మనిచ్చాడు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయమై కొన్ని రోజుల క్రితం రానాను ప్రశ్నిస్తే... సరోగసి పద్దతిలో 'భద్ర' పుట్టాడంటూ ఆ మధ్య సరదాగా బదులిచ్చాడు.
తాజాగా రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి' టీజర్ విడుదలైన సందర్భంగా ఓ అభిమానిని రానాని ఓ ప్రశ్న వేశారు. ‘బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరు? మీరు ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే' అని రానాకు ట్వీట్ చేశాడు. దీనికి రానా.. కాజల్ అంటూ సమాధానమిచ్చారు. కాజల్ కూడా... ఈ ట్వీట్‌ని కాజల్ అగర్వాల్ రీట్వీట్ చేస్తూ.. ‘ఇక నేనేం చెప్తాను. మాది జన్మ జన్మల అనుబంధం' అంటూ కమెంట్ చేసి తనదైన శైలిలో స్పందించింది. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో జోడీగా నటిస్తున్నరానా, కాజల్ చేసిన ఈ ట్వీట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి' చిత్రం టీజర్ స్వర్గీయ డి. రామానాయుడు జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరి నిర్మాతలు. ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో రాణా సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా "రానా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం "నేనే రాజు నేనే మంత్రి"అని సురేష్ బాబు అన్నారు.
రానా, కాజల్, అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని, జెపీ, రఘు కారుమంచి, బిత్తిరి సత్తి, ప్రభాస్ శీను, శివాజీ రాజా, జోష్ రవి, నవీన్ నేలి, ఫన్ బకెట్ మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
