Asianet News TeluguAsianet News Telugu

'విరాట పర్వం’...ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్

 విరాటపర్వం యొక్క ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయ్యింది.  విరాట పర్వం సినిమా టీజర్, ట్రైలర్ చూసిన తరువాత ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అనే బజ్ ఇండస్ట్రీలో ఉండటంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
 

Rana To Sing For Virata Parvam
Author
Hyderabad, First Published Dec 2, 2021, 4:36 PM IST

"అరణ్య" చిత్రంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన రానా అతి త్వరలో మరో విభిన్నమైన పాత్రతో విరాట్ పర్వం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. 1990 లో తెలంగాణా ప్రాంతంలో ఉన్న నక్సల్స్ నేపధ్య  కథతో ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు వేణు ఉడుగుల వరంగల్ లో తన బాల్యంలో నక్సల్స్ ఎదుర్కున్న పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నాడు. త్వరలోనే విడుదల కాబోయే ఈ చిత్రానికి సంభందించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి.

రానా 37 వ పుట్టిన రోజు సందర్బంగా డిసెంబర్ 14న నిర్మాతలు ఓ లిరికల్ వీడియోని విడుదల చేస్తున్నారు. ఇందులో విశేషమేమిటంటే...ఈ పాటను రానా స్వయంగా పాడారు.  రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విరాటపర్వం యొక్క ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయ్యింది.  విరాట పర్వం సినిమా టీజర్, ట్రైలర్ చూసిన తరువాత ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అనే బజ్ ఇండస్ట్రీలో ఉండటంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.

 ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. అలాగే   విరాటపర్వంలో నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990’s నాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సినిమాలో రానా, ప్రియమణి నక్సలైట్లుగా కనిపించనున్నారు. అభ్యుదయ భావాలూ కలిగిన యువకుడిగా రానా అద్బుతంగా నటించాడు. అతడి కవితలు చదివి అభిమానిగా మారి అతడి ప్రేమకోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుంది.

వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లు అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టడటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios