టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో విరాట పర్వం ఒకటి. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న ఈ రివొల్యూషన్ డ్రామాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. రానా దగ్గుబాటి నక్సలైట్ రోల్ చేస్తుండగా సాయి పల్లవి 90ల నాటి పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. పీరియాడిక్ కథగా తెరకెక్కుతున్న విరాటపర్వంలో, లవ్ అండ్ రివొల్యూషన్ అనే ఎమోషన్స్, కాన్సెప్ట్స్ హైలెట్ అట. కాగా విరాట పర్వం మూవీ విడుదల తేదీ నేడు చిత్ర యూనిట్ ప్రకటించారు. 

సమ్మర్ కానుకగా విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. ప్రకటన పోస్టర్ లో నక్సలైట్ గా రానా లుక్ ఆకట్టుకుంది. ఎప్పుడో విరాటపర్వం మూవీ షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా.. రానా అమెరికా వెళ్లడం, లాక్ డౌన్ వంటి కారణాల వలన ఆలస్యం అయ్యింది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చివరి దశకు చేరిందని వినికిడి. 

టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి లేడీ నక్సల్ గా కీలక రోల్ చేస్తుండడం మరో విశేషం. దర్శకుడు వేణు ఉడుగల అద్భుతమైన కాన్సెప్ట్ తో విరాట పర్వం మూవీ తెరకెక్కిస్తున్నారు.  సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక రానా నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది.