బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు రానా దగ్గుబాటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుంటాడు. సోలో హీరోగా కూడా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇప్పుడు ఓ విభిన్నమైన ప్రేమకథలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 'నీది నాది ఒకే కథ' సినిమా ఫేం దర్శకుడు వేణు ఊడుగుల చెప్పిన కథ విన్న రానా ఇంప్రెస్ అయి సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.

ఈ సినిమాలో రానా సరసన హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ముందుగా ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సాయి పల్లవిని ఫైనల్ చేసుకున్న తరువాత హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడట దర్శకుడు. తెరపై రానా, సాయి పల్లవిల జంటగా ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తుందని భావిస్తున్నాడు.

పీరియాడిక్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి 'విరాటపర్వం 1992' అనే టైటిల్ ని కూడా కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు. 'పడి పడి లేచే మనసు' సినిమాను  నిర్మిస్తోన్న సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించబోతున్నారు.