టాలీవుడ్ టాలెస్ట్ హీరో రానా దగ్గుబాటి ఏ సినిమా చేసినా అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉంటుంది. కథ మొదలుకొని క్యారెక్టరైజేషన్ లో కూడా కూడా ఈ స్టార్ హీరో ప్రయోగాలు గట్టిగానే చేస్తుంటాడు. అయితే నెక్స్ట్ గతంలో హారర్ సినిమాతో అటూ నార్త్ జనాలను ఇటు సౌత్ ఆడియెన్స్ ని ఓ రేంజ్ లో భయపెట్టిన మిలింద్ రావ్ తో ఒక సినిమా చేయనున్నాడు. 

2017లో వచ్చిన గృహం సినిమా నార్త్ అండ్ సౌత్ ఇండస్ట్రీలలో ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా సక్సెస్ లేని సిద్దార్థ్ కి ఒక హారర్ సినిమాతో డిఫరెంట్ హిట్ ఇచ్చిన మిలింద్ ఇప్పుడు రానాతో కలవనున్నారు. రీసెంట్ గా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన మిలింద్ త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. 

ఈ సినిమా కూడా డిఫరెంట్ స్టయిల్ లో థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక ఈ స్పెషల్ ప్రాజెక్టును విశ్వశాంతి ప్రొడక్షన్ బ్యానర్ లో గోపినాథ్ ఆచంట నిర్మించనున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనున్నట్లు సమాచారం.