తెలుగుచిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలను సృష్టించి రాజకీయాలను సైతం మలుపుతిప్పిన నందమూరి తారకరామారావు బయోపిక్ పై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తోన్న ఈ బయోపిక్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 

సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎదో ఒక విధంగా హైప్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇక చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేడు పోస్టర్ ని రిలీజ్ చేసింది. దాదాపు చంద్రబాబు హావభావాలతో రానా మరింత హైప్ క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. 

అందరి ద్రుష్టి ఎక్కువగా ఈ పాత్రపైనే ఉంది. దర్శకుడు క్రిష్ ఎలా చూపిస్తాడో అని అమితంగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా ట్రైలర్ లాంచ్ ను హైదరాబాద్ లో ఈ నెల 16న నిర్వహించనుండగా ఆడియో వేడుకను ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో ప్లాన్ చేస్తున్నారు. సాయి కొర్రపాటి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విద్యాబాలన్ - కళ్యాణ్ రామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.