విలక్షణ నటుడిగా రానా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలతో రానాకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా క్రేజ్ ఏర్పడింది. ఇటీవల రానా ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో తనకు ఎదురైన అన్ని ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చాడు. ఓ యాంకర్ మాత్రం సౌత్ చిత్రాలని కాస్త చిన్నచూపు చూసినట్లు ఓవరాక్షన్ చేసింది. 

రానా ఆ యాంకర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. తన చిన్నతనంలో రోజా సినిమా చూశానని ఆ తర్వాత చూసిన సౌత్ ఇండియన్ సినిమాలన్నీ ఒకే తరహాలో ఉన్నట్లు తనకు అనిపించిందని సదరు యాంకర్ తెలిపింది. కానీ బాహుబలి చిత్రం ఓ అద్భుతం అని చెబుతూ.. ఆ చిత్రంతో సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ లో చాలా మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. 

దీనిపై రానా స్పందిస్తూ.. ఇండియన్ సినిమా అభిమానులకు ఇతర భాషల సినిమాలపై ఇలాంటి అభిప్రాయం ఉంటుందని నేననుకోను. అసలు ఇండియన్ మూవీ లవర్స్ భాష గురించి పట్టించుకోరు. అన్ని సినిమాలని ఆదరిస్తారు. బాహుబలి కంటే ముందు రజినీకాంత్ సినిమాలు అన్ని భాషల్లో విజయం సాధించాయి. అవెంజర్స్ చిత్రం ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజై విజయం సాధించింది. మీరంటున్నట్లు భాష సరిహద్దులు లేవని రానా తెలిపాడు. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రానా మాటలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.