ఓ సీరియల్ రేపిస్ట్ గతాన్ని తవ్వే అన్వేషణలో జరిగే కథ ఇది. 


హీరో దగ్గుబాటి రానాకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బాహుబలి కంటే ముందే హిందీలోనూ కొన్ని సినిమాలు చేసి ఫేమస్ అయ్యారు. అయితే, బాహుబలి తర్వాత రానా క్రేజ్ నెక్ట్స్ లెవెల్‍కు వెళ్లిందనేది నిజం. దాన్ని కంటిన్యూ చేస్తూ రానా నాయుడు వెబ్ సిరీస్‍తో ఓటీటీ స్పేస్‍లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు రానా. ఇప్పుడు అమేజాన్ తో రెండు ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు రానా. అవి ఏమిటంటే..

 ఓటీటీలో టాక్‍షో చేసేందుకు రెడీ అయ్యారు. అలాగే చీకట్లో అనే సినిమా సైతం ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. చీకట్లో వెబ్ సీరిస్ ని చంద్ర పెమ్మరాజు డైరక్ట్ చేస్తున్నారు. అమేజాన్ ఒరిజనల్ గా రానుంది. ఇదో ఇన్విస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. ఓ సీరియల్ రేపిస్ట్ గతాన్ని తవ్వే అన్వేషణలో జరిగే కథ ఇది. 

Scroll to load tweet…

మరో ప్రక్క అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ‘ది రానా కనెక్షన్’ పేరుతో టాక్ షో హోస్ట్ చేయనున్నారు రానా. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియా కింద ఈ టాక్ షో ప్రొడ్యూజ్ చేయనున్నారు రానా. గతంలో రానా ద‌గ్గుబాటి నెం.1 యారీ అనే పేరుతో ఓ షోని నిర్వ‌హించాడు. అందులో త‌న స‌న్నిహితులంద‌రినీ తీసుకొచ్చి ఇంట‌ర్వ్యూలు చేశాడు. ఓటీటీలో ఈ షో యావ‌రేజ్ అనిపించుకుంది. ఇప్పుడు రానా అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఇలాంటి ఒక షోను హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా జ‌రిగిన స్పెష‌ల్ ఈవెంట్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్ర‌తినిధులు రానా హోస్ట్ గా టాక్ షో ను నిర్మిస్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. ది రానా క‌నెక్ష‌న్ పేరుతో సాగే ఈ షో లో ప‌లువురు సెలిబ్రిటీలు పాల్గొన‌నున్నారు. మ‌రి ఈ షో అయినా కాఫీ విత్ క‌ర‌ణ్ ను మ్యాచ్ చేస్తుందా లేదా అన్న‌ది చూడాలి. ‘ది రానా కనెక్షన్’ టాక్ షో ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందో అమెజాన్ ప్రైమ్ వెల్లడించలేదు. త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉంది.

Scroll to load tweet…

ప్రస్తుతం రానా ... కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టైయాన్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‍లో ఆయన పాల్గొన్నారు. రానా ప్రధానపాత్రలో హిరణ్యకశ్యప మూవీని కూడా ప్రకటించారు. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ మైథలాజికల్ చిత్రం ఉండనుంది. ఈ మూవీని ఆయనే నిర్మించనున్నారు.