బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాక్టర్  రానా మల్టీస్టారర్ కథలకుగ్యాప్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కథలో పాత్ర నచ్చితే భాషాబేధం లేకుండా సినిమాలను ఒకే చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. 

ఇక నెక్స్ట్ కోలీవుడ్ లో కూడా మరో స్టార్ హీరోతో రానా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ప్రముఖ స్వాతంత్య్ర పోరాటయోధుడు బిర్సా ముండా జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌ కు పా.రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. కాలా - కబాలి సినిమాల అనంతరం పా.రంజిత్ చేస్తోన్న డిఫరెంట్ మూవీ ఇది. అయితే ఈ హిస్టారికల్ మూవీలో ఇదివరకే ఆర్య ఒక హీరోగా సెట్టయ్యాడు. 

ఇక మారో ప్రధాన పాత్ర కోసం దర్శకుడు రానాను సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. ఈ ద్విభాషా మల్టీస్టారర్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.