అనంతపురంలో నేనే రాజు నేనే మంత్రి అంటున్న రానా బాహుబలి తర్వాత తొలిసారి మరో సినిమా షూటింగ్ లో పాల్గొన్న రానా జనం నుంచి వచ్చిన స్పందనకు సంతోషం వ్యక్తం చేసిన రానా

బాహుబలి చిత్రం కోసం మూడేళ్లపాటు మరే చిత్రం కోసం సంతకం చేయకుండా పూర్తి నిబద్ధతతో మాహిష్మతి సామ్రాజ్యాధిపతి.. రాజా భల్లాలదేవుడు రానా కమిట్ మెంట్ తో పనిచేశారు. ఇక బాహుబలి రిలీజ్ కు నాలుగు నెలల గడువు కూడా లేదు. ఈ ఏడాగి ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ అంతా పూర్తయింది.

బాహుబలి షూటింగ్ పూర్తి కావడంతో తదుపరి చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు రానా. రానా ప్రస్థుతం ఘాజీ, నేనే రాజు, నేనే మంత్రి, 1945 తదితర చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్థుతం కొత్త ఏడాదిన తొలి సీన్ షూటింగ్ కోసం రానా అనంతపురం పర్యటనలో ఉన్నారు.

తదుపరి చిత్రం షూటింగ్ నేనే రాజు నేనే మంత్రి కోసం రానా అనంతపురంలో షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా కొత్త ఏడాది ఫస్ట్ షూట్ లోనే అనంత జనం నుంచి వచ్చిన విశేష స్పందన చూసి రానా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తన సంతోషాన్ని సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ద్వారా... పంచుకున్నాడు రానా. ట్విట్టర్ లో ఫస్ట్ షూట్ ఇన్ 2017 అంటూ ఒక ఫోటోని అప్ లోడ్ చేశాడు. దీంతో రానా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.