టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గతంలో హీరోయిన్ త్రిషతో డేటింగ్ చేశాడని వార్తలు వినిపించేవి. దానికి తగ్గట్లే ఇద్దరూ కలిసి సన్నిహితంగా మెలిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇది ఇప్పటి విషయం కాదు..

ఆ తరువాత కొంతకాలం తరువాత త్రిష ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. నిశ్చితార్ధం కూడా చేసుకుంది. కానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా రానాకి త్రిషకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

కరణ్ జోహార్ టాక్ షోలో పాల్గొన్న రానాకి 'త్రిషతో డేటింగ్ చేసావు కదా.. పెళ్ళెందుకు చేసుకోలేదనే' ప్రశ్న ఎదురుకాగా.. తమ మధ్య లాంగ్ ఫ్రెండ్ షిప్ ఉంది తప్ప లాంగ్ డేటింగ్ లేదని రానా చెప్పాడు. ఎక్కువ కాలం ఫ్రెండ్లీగా ఉండడంతో చాలా మంది డేటింగ్ అని భ్రమపడ్డారని, అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.

మరి పెళ్లెప్పుడని ప్రశ్నిస్తే.. ''నా స్నేహితులు చరణ్, బన్నీ పెళ్లి చేసుకొని ఆ తరువాత బిజీ అయిపోయారు.. అందుకే నేను సింగిల్ ఫ్రెండ్స్ తో అడ్జస్ట్ అవుతున్నా.. పెళ్లయితే భార్యతోనే సమయం గడపాలి, ఫ్రెండ్స్, సింగిల్ స్టేటస్ ఉండదని కాబట్టి అలాంటి లైఫ్ ఎందుకులే అని పెళ్లి చేసుకోలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు.