ఏపీ పాలిటిక్స్ ని క్యాష్ చేసుకోనున్న 'లీడర్'.. గ్రాండ్ రీ రిలీజ్ కి ప్లాన్ ?
భల్లాల దేవుడు రానా దగ్గుబాటి డెబ్యూ మూవీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ అనే పొలిటికల్ డ్రామాలో రానా నటించి నటుడిగా పరిచయం అయ్యాడు.

భల్లాల దేవుడు రానా దగ్గుబాటి డెబ్యూ మూవీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ అనే పొలిటికల్ డ్రామాలో రానా నటించి నటుడిగా పరిచయం అయ్యాడు. లీడర్ చిత్రం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. 2010లో విడుదలైన ఈ చిత్రం గురించి అప్పట్లో రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరుగుతోంది. అవినీతి అనే అంశం కూడా బాగా హైలైట్ అవుతోంది. ఈ చిత్రంలో అవినీతి అనే అంశం కూడా ఉంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఏపీలో రాజకీయ వేడి పెరుగుతూనే ఉండడం ఖాయం.
ఏపీ రాజకీయ వాతావరణాన్ని క్యాష్ చేసుకునే విధంగా లీడర్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో రిలీజ్ కి చాలా పొలిటికల్ చిత్రాలు సిద్ధం అవుతున్నాయి. నారా రోహిత్ ప్రతినిథి 2 తో రాబోతున్నాడు. మహి వి రాఘవ్ యాత్ర 2, రాంగోపాల్ వర్మ వ్యూహం అంటూ హడావిడి చేస్తున్నారు.
ఈ చిత్రాల మధ్యలో లీడర్ ని రీరిలీజ్ చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నట్లు టాక్. లీడర్ రీరిలీజ్ అయితే ఒక పార్టీకి అవినీతిని హైలైట్ చేసినట్లు ఉంటుందని ఒక వర్గం ప్లాన్ చేస్తోందట. ముఖ్యమంత్రి మరణించిన తర్వాత అతడి కొడుకు రాజకీయ ఎత్తుగడలతో ఎలా సీఎం పీఠాన్ని దక్కించుకున్నాడు అనే ఆసక్తికర కథతో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
రానా ఈ చిత్రంలో తన పెర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటించారు. ఎలాగు ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా ఉంది.