దగ్గుబాటి హీరోలు రానా, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
దగ్గుబాటి హీరోలు రానా, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనితో రానా, వెంకటేష్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
రానా ఇటీవల ఎక్కువగా జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి, దగ్గుబాటి ఫ్యామిలీ రేలషన్ ఉన్న సంగతి తెలిసిందే. దీనితో నాగ చైతన్య , సమంత గురించి అప్పుడప్పుడూ దగ్గుబాటి హీరోలకు కూడా ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. సమంత నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు.

తాజాగా ఇంటర్వ్యూలో సమంత గురించి టాపిక్ రాగా.. రానా ఆసక్తికరంగా బదులిచ్చాడు. ఇప్పటికీ తాను సమంతతో మాట్లాడుతున్నానని రానా తెలిపాడు. సమంత మాయోసైటిస్ తో బాధపడుతోంది అని తెలిసి ఆమెకి ఫోన్ చేశా. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నా అని రానా తెలిపాడు.

నటీనటులకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. వారి ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యల గురించి బయటకి చెప్పాలా లేదా అనేది వారి ఇష్టం. ఎవరి జీవితం కూడా కేక్ వాక్ లాగా ఉండదు. సమస్యలు అందరికీ ఉంటాయి కానీ.. వాటిని ఎలా అధికమిస్తాం అనేదే ప్రశ్న అని రానా తెలిపాడు.
అయితే రానా.. నాగ చైతన్య, సమంత డివోర్స్ గురించి మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇక రానా నేనే రాజు నేనే మంత్రి తర్వాత సరైన ప్రాజెక్ట్ ఎంచుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఇటీవల రానా అరణ్య, విరాటపర్వం అంటూ చేసిన ప్రయోగాలు పూర్తిగా బెడిసికొట్టాయి.
