Asianet News TeluguAsianet News Telugu

చిన్నప్పటి నుంచి చూస్తునే ఉన్నా ..పాన్ ఇండియా సినిమాలపై రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

పాన్ ఇండియా సినిమాలపై ఇట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు..టాలీవుడ్ స్టార్ హీరో.. విలక్షణ నటుడు రానా దగ్గుబాటి. ఒకప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా తేడా ఉంద అన్నారు. కాని పాన్ ఇండియా సినిమాలు తాను చిన్నప్పుడే చూశానన్నారు. రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. 

Rana Daggubati Interesting Comments about Pan India Movies
Author
First Published Dec 4, 2022, 1:43 PM IST

ఇప్పుడు సినిమాలకు భాషా బేధం లేదు.గతంలో తెలుగు సినిమాలను అటు బాలీవుడ్  తో పాటు ఇటు తమిళ ఇండస్ట్రీ వారు కాస్త తక్కువగా చూసేవారు. కాని తెలుగు సినిమా అంచలంచెలుగా ఎదుగుతూ.. తమిళ పరశ్రమనే కాదు.. బాలీవుడ్ ను కూడా దాటేసుకుని నెంబర్ వన్ స్థానంలో నిలబడింది. తెలుగు సినిమాను తక్కువ చేసిన వారికి  సమాధానం దొరికింది. ఎప్పుడైతే బాహుబలి రిలీజ్ అయ్యిందో... అప్పుటినుంచి టాలీవుడ్ ఖ్యాతీ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ ఘనత అంతా రాజమౌళికే దక్కుతుంది. ఇక ఈక్రమంలో పాన్ ఇండియా సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరో రానా దగ్గుబాటి. 

టాలీవుడ్ లో ప్రయెగాత్మక సినిమాలకు పెట్టింది పేరు రానా దగ్గుబాటి. కథల విషయంలో సినిమాల విషయంలో.. పాత్రల విషయంలో.. రొటీన్ కు భిన్నంగా ఆలోచిస్తుంటారు రానా. తొందరపడి సినిమాలు చేయకుండా.. జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఈ హీరో... బాహుబలి సినిమాతో పాన్ ఇండియ స్థాయికి ఎదిగాడు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఏమాత్రం గర్వం చూపించకుండా దూసుకుపోతున్న రానా..పాన్ ఇండియా సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

పాన్‌ ఇండియా అని ఇప్పుడు అంటున్నారు కానీ, ఎప్పట్నుంచో ఉన్నాయన్నారు. నా చిన్నప్పుడు మణిరత్నం రోజా, బొంబాయి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యేవి అన్నారు రానా. అవి తమిళ సినిమాలే అయినా.. తెలుగతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయ్యాయి అన్నారు. ఇన మన టాలీవుడ్ నుంచి రామ్‌ గోపాల్‌ వర్మ సత్య కూడా పాన్‌ ఇండియా సినిమానే అన్నారు. ఇక బాలీవుడ్ పరిస్థితి బాలేదు నిజామే.. కాని ఇప్పుడిప్పుడే  హిందీ పరిశ్రమ కోలుకుంటుందన్నారు రానా. గంగూబాయ్, బ్రహ్మాస్త్రా సినిమాలు దీనికి ఉదాహరణ అన్నారు. 

స్టార్‌డమ్‌ నిర్వచనమే మారిపోయిందన్నారు రానా.. ఇప్పుడ సినిమాలకు కంటెంట్ ఉంటే చాలు.. పబ్లిసిటీతో పని లేదు అన్నారు. పుష్ప, కాంతార సినిమాలు దీన్ని రుజువు చేశాయి అన్నారు. గతంలో ఏ బాష సినిమా.. ఆ భాషకు గొప్ప.. ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసేది కాదు.. కాని ఇప్పుడు అన్ని భాషలు ఒకే గొడుకు కిందకు వచ్చాయన్నారు. పాన్ ఇండియా సినిమాల వల్ల ..అన్ని పరిశ్రమలు కలిసిఇండియన్ సినిమాకిందకు వచ్చాయన్నారు. 

భారతీయ సినిమా స్వరూపం రోజురోజుకూ మారిపోతున్నది. ఒకప్పుడు తెలుగు, తమిళం సినీజనాలకు ముంబైలో ఏం జరుగుతున్నదో అంతగా తెలిసేది కాదు! అది వేరే ప్రపంచం అనుకునేవాళ్లు. ఇప్పుడు ఇండస్ట్రీ ఎల్లలు చెరిగిపోతున్నాయి. భారతీయ సినిమా పరిపూర్ణతను సంతరించుకుంటున్నది. ఇఫ్ఫీ (ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) వేదికగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ అని కాకుండా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అని ప్రస్తావిస్తుండటమే ఇందుకు ఉదాహరణ.

ఓటీటీల వల్ల కూడా సినిమాల మధ్య భాషా బేధం లేకుండా పోయిందన్నారు రానా. ఇప్పుడే ఏ భాషలోసినిమా చూడాలి అన్నా ఓటీటీలో చూడవచ్చు. మరికొన్ని డబ్బింగ్ అయ్యి.. పాపులర్ భాషల్లో రిలీజ్ అవ్వడంతో.. అన్ని సినిమాలు కలిసిపోతున్నాయి అన్నారు.  ఓటీటీ కారణంగా ఇతర భాషా చిత్రాలు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాయి అన్నారు రానా దగ్గుబాటి. 

Follow Us:
Download App:
  • android
  • ios