Asianet News TeluguAsianet News Telugu

Rana: సోషల్‌ మీడియాకి రానా గుడ్‌బై.. పోస్ట్ లన్నీ డిలీట్‌.. కరెక్ట్ గా పెళ్లి రోజే ఇలా?

ప్రతి ఒక్కరు దీన్ని వాడటం, ఫాలో అవుతున్న సమయంలో రానా మాత్రం దానికి భిన్నంగా ఆలోచించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తప్పుకున్నారు. ఊహించని విధంగా ఆయన ఇన్‌స్టాకి గుడ్‌ బై చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 

rana daggubati goodbye to social media deleted all posts fans shock
Author
Hyderabad, First Published Aug 9, 2022, 8:10 PM IST

సోషల్‌ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ప్రసార సాధనంగా మారింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజానికం వరకు ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియాని వాడుతున్నారు. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతానికి పెద్ద పీఠ వేసే సాధనం ఇన్‌స్టాగ్రామ్‌. ఫ్యామిలీ, కెరీర్ విషయాలను ఇందులో షేర్‌ చేసుకోవచ్చు. ఫోటోలకు కేరాఫ్‌గా నిలిచే మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌. ఫోటో షూట్లు, ప్యామిలీ ఫోటోలు, వీడియో క్లిప్‌లు, ఇస్టా స్టోరీలను పంచుకుంటుంటారు.

ప్రతి ఒక్కరు దీన్ని వాడటం, ఫాలో అవుతున్న సమయంలో రానా(Rana) మాత్రం దానికి భిన్నంగా ఆలోచించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తప్పుకున్నారు. ఊహించని విధంగా ఆయన ఇన్‌స్టాకి గుడ్‌ బై చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. గత ఐదు రోజు క్రితం సోషల్‌ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నా అని Rana Daggubati చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఊహించిన విధంగా ఆయన పోస్ట్ లన్నీ డిలీట్‌ చేశారు. ఫోటోలతో సహా ఇన్‌స్టా మొత్తం డిలీట్‌ చేశారు. 

కొంత కాలం సోషల్‌ మీడియాకి దూరంగా ఉండానుకుంటున్నానని, ఇది చాలా ఉత్తమమైన, శక్తివంతమైన నిర్ణయమని, మంచి సినిమాలతో కలుద్దామని చెప్పారు. మీపై అమితమైన ప్రేమతో  అని ఇటీవల రానా ట్విట్టర్‌లో పేర్కొన్న విసయం తెలిసిందే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్ట్ లన్నీ డిలీట్‌ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. మరి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా ఉంటారా? ట్విట్టర్‌ కూడా దూరమవుతారా? అనేది సస్పెన్స్ గా మారింది. ఇదే ఆయన అభిమానులను ఆలోచనల్లో పడేస్తుంది. 

ఇదిలా ఉంటే రానా సోషల్‌ మీడియాకి దూరంగా ఉండాలనుకోవడానికి కారణమేంటనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. సినిమాల విషయంలో ఆయన బ్రేక్‌ తీసుకుంటున్నాడా? లేక వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందులా? అనేది ప్రశ్నగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలకు నెటిజన్ల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసే సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి అనేక రూమర్స్ వినిపిస్తుంటాయి. కొందరు డైరెక్ట్ గా ప్రశ్నిస్తుంటారు. వాటికి సమాధానం చెప్పడం వారికి తలనొప్పిగా మారుతుంటుంది. దీంతో సోషల్‌ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటారు.

మరికొందరు కొంత బ్రేక్‌ తీసుకుని రిఫ్రెష్‌గా మళ్లీ రావాలనుకునే సమయంలో ఇలాంటి బ్రేకులు తీసుకుంటారు. మరి రానా ఇలా చేయడానికి కారణ అసలు కారణమేంటో తెలుసుకునే పనిలో బిజీ అయ్యారు నెటిజన్లు. రానా ఇటీవల `విరాటపర్వం` చిత్రంతో ఆకట్టుకున్నారు. సినిమా ఫలితం తేడా కొట్టినా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సందర్బంగా ఇకపై ఇలాంటి సినిమాలు చేయనని, కమర్షియల్‌ సినిమాలే చేస్తానని తెలిపారు. 

తనకు ఇంత మంది అభిమానులున్నారా? అనే విషయం తనకు ఆ సినిమాతోనే తెలిసిందని, చాలా మంది ఇలాంటి సినిమాలు ఎందుకుచేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని కూడా ఓపెన్‌ అయ్యారు రానా. ఇకపై అభిమానులకు నచ్చే చిత్రాలు చేస్తానని, కమర్షియల్‌ సినిమాలు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. దీనికితోడు రానా నుంచి కొత్తగా మరే సినిమా అనౌన్స్ మెంట్ లేదు. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి `రామానాయుడు` అనే ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు. హీరోగా సినిమాలు అధికారికంగా ఒక్కటి కూడా ప్రకటించలేదు. ఈనేపథ్యంలో ఇప్పుడు సోషల్‌ మీడియాకి దూరం కావాలనుకుంటున్నట్టు ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. 

రానా రెండేళ్ల క్రితం మ్యారేజ్‌ చేసుకున్నారు. గత ప్రియురాలు మిహీకా బజాజ్‌ని ఆయన 2020లో కరోనా సమయంలో మే 20న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆయన, ఆగస్ట్ 8న మ్యారేజ్‌ చేసుకున్నారు. సోమవారంతోనే వీరి పెళ్లి అయిన రెండేళ్లు పూర్తి చేసుకుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి రానా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ లన్నీ డిలీట్‌ చేయడం మరింత అనుమానాలకు తావిస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios