Asianet News TeluguAsianet News Telugu

స్పందించిన రానా దగ్గుబాటి, తండ్రి కాబోతున్నాడంటూ వస్తున్న వార్తలపై ఏమన్నాడంటే.. ?

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి - మిహికా బజాజ్ దంపతులు తల్లీ తండ్రులుగా ప్రమోషన్ సాధించారని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు రానా. ఫ్యాన్స్  కు క్లారిటీ ఇచ్చారు. 

Rana Daggubati Gives clarity about Miheeka Pregnancy Rumors
Author
First Published Nov 22, 2022, 10:35 AM IST

ఇక రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలోన్యూస్ తెగ హల్ చల్ చేస్తోంది. రీసెంట్ గా మిహికా ఓ కార్యక్రమంలో కాస్త బొద్దుగా కనిపించడంతో .. మిహికా ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ బయటకు వచ్చింది. అంతే కాదు ఆ విషయం వాళ్లు అనౌన్స్ చేయకముందే... ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవడం స్టార్ట్ చేవారు. కనీసం రానా వాళ్ల ఫ్యాన్స్ కు కూడా ఈ విషయం చెప్పలేదు అంటూ.. కొంత మంది కామెంట్ చేశారు. 

అంతే కాదు మరో కార్యక్రమంలో మిహికా ఓ పిల్లాడిని ఎత్తుకుని కనిపించడంతో.. అంతా కంగ్రాట్స్ చెప్పడం కూడా  స్టార్ట్ చేశారు. రానా దంపతులు తల్లితండ్రులయ్యారంటూ దగ్గుబాటి ప్యాన్స్ ఖుషి అయ్యారు. అంతే కాదు సెలబ్రిటీలు కూడా ఈ విషయాన్ని నమ్మి..కంగ్రాట్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. సింగర్ కనికా కూడా ఈ జంటను సోషల్ మీడియాలో విష్ చేవారు.  ఇక ఇది ఇలా కంటీన్యూ అవుతుంది అని అనుకున్నడో ఏమో.. రానా దగ్గుబాలి ఈ విషయంలోక్లారిటీ ఇచ్చారు. 

క్లియర్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ముఖ్యంగా తన ఫ్యాన్స్ కు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని ఫీల్ అయినట్టు ఉన్నాడు రానా. అందుకే తాను తండ్రి అవుతున్నాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదు అన్నాడు. మిహికా గర్భవతి కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు దగ్గుబాటివారి  హీరో. 

ఇక రానా దగ్గుబాటి  చాలా కాలంగా తానుప్రేమించిన మిహికా బజాజ్ ను 2020 అగస్ట్ లో పెళ్ళాడాడు. వెంకటేష్ పెద్ద కూతురుకు స్నేహితురాలైన మిహికాను ప్రేమించి పెళ్ళాడాడు రానా. ఇక ఈ జంట టాలీవుడ్ లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటున్నారు. అయితే రానా పెళ్లి తరువాత  సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు మిహికా మాత్రమే నెట్టింట్లో సందడి చేస్తుంది. అంతే కాదు సినిమాలు కూడా అంత యాక్టీవ్ గా చేయడం లేదు రానా. 

Follow Us:
Download App:
  • android
  • ios