జూన్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమాలో స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో స్పష్టం చేశారు.
ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘స్పై’ ఒకటి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్లకు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. స్పై మూవీ టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. తాజాగా ఈ చిత్రం అఫీషియల్ గా రిలీజ్ ఎనౌన్సమెంట్ డేట్ ఇచ్చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో దగ్గుపాటి రానా కనిపించనున్నారు.
ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన గెస్ట్ రోల్ కు రానా ని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ మేరకు షూటింగ్ పూర్తై, డబ్బింగ్ కూడా చెప్పేసారు. రానా పాత్ర సెకండాఫ్ లో వస్తుందని తెలుస్తోంది. నిఖిల్ కు, రానా కు మధ్య ఓ డైలాగు కూడా ఉంటుందని తెలుస్తోంది. రానా ఓ పెద్ద ఎపిసోడ్ లో కనిపించబోతున్నట్లు వినికిడి. షారూఖ్ పఠాన్ లో సల్మాన్ కనిపించినట్లు ...కనిపించి తన ఫ్యాన్స్ కు కిక్ ఇస్తాడంటున్నారు. అయితే ఎక్కడ కనిపిస్తాడనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అవ్వాల్సిందే.

జూన్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమాలో స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో స్పష్టం చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం స్వరపరుస్తున్నారు.
