రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు. అయితే ఇటీవల రానా జోరు కాస్త తగ్గింది. రానా చివరగా రానా నాయిడు వెబ్ సిరీస్ లో వెంకటేష్ తో కలసి అలరించాడు.
రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు. అయితే ఇటీవల రానా జోరు కాస్త తగ్గింది. రానా చివరగా రానా నాయిడు వెబ్ సిరీస్ లో వెంకటేష్ తో కలసి అలరించాడు. అలాగే స్పై చిత్రంలో కామియో రోల్ పోషించాడు. సీతా రామం చిత్రంతో దేశం మొత్తాన్ని మాయ చేసిన సీత.. మృణాల్ ఠాకూర్ త్వరలో రానాతో జత కట్టబోతోంది.
అయితే ఇది సినిమా కోసం కాదు. ప్రతి ఏటా వైభవంగా జరిగే సైమా అవార్డుల వేడుకకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ఏడాది సైమా వేడుకలకు దుబాయ్ వేదిక కాబోతోంది. తాజాగా సైమా అవార్డుల సంస్థ ఈ విషయాన్ని ప్రకటించారు. 11 వ సైమా వేడుకలు దుబాయ్ లో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
అనౌన్స్మెంట్ కార్యక్రమానికి రానా దగ్గుబాటి, మృణాల్ ఠాకూర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సైమా ఛైర్ పర్సన్ బృంద ప్రసాద్ కూడా పాల్గొన్నారు. సైమా వేడుకల్లో రానా, మృణాల్ ఠాకూర్ జంటగా హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే వీరిద్దరూ అనౌన్స్మెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈసారి సైమా అవార్డ్స్ వేడుకకి ప్రముఖ కార్పొరేట్ ఆటోమొబైల్ సంస్థ నెక్సా స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ సౌత్ చిత్ర పరిశ్రమని ఏకం చేయడంలో సైమా పాత్ర ఎంతైనా ఉందని రానా అన్నారు. తాను సైమా వేడుకల్లో భాగం కాబోతుండడం సంతోషంగా ఉందని అన్నారు. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ సీతా రామం చిత్రంతో సౌత్ ప్రేక్షకులకు చేరువయ్యాను. ఇప్పుడు సైమా అవార్డ్స్ లో కూడా భాగం కాబోతుండడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.
