ప్రేమ జంట రానా దగ్గుబాటి,మిహికా బజాజ్ పెళ్లి తంతుతో ఒక్కటయ్యారు. కోరి ఒక్కటైన జంట ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడింది. టాలీవుడ్ లో ముచ్చటైన జంటగా, రానా మరియు మిహిక బజాజ్ లను చెప్పుకుంటున్నారు. అతికొద్ది మంది మాత్రమే హాజరైన ఈ పెళ్లి వేడుకకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పెళ్ళికి హాజరుకాలేని బంధు మిత్రులకు వర్చువల్ రియాలిటీ సెట్స్ పంపడం జరిగింది. వాటి ద్వారా చాలా మంది వేడుక చూసి ప్రత్యక్షంగా హాజరైన అనుభూతిని పొందారు. ఇక ఈ వేడుకలో పెళ్లి కూతురు మిహికా బజాజ్ వేసుకున్న డ్రస్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మిహికా పెళ్లి డ్రస్ కొరకు 6 లక్షల రూపాయలు కేటాయించారట. ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా ఆ డ్రస్ ని డిజైన్ చేశారట. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ లెహంగా మరియు కోరల్ దుప్పట్టా ఆమె ధరించగా మెరిసిపోయారు. ఆ డ్రస్ కి మొత్తం హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వేయించారట. అనేక మంది డిజైనర్స్ గంటల తరబడి శ్రమించారని సమాచారం. 
 
ఇక రానా వైట్ కలర్ ధోతి, కుర్తా సెట్ ధరించాడు.  ఖరీదైన బట్టలలో రానా-మిహికా జంట అధ్బుతంగా ఉన్నారు. ఇక ఈ పెళ్లి వేడుక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లి ఫొటోలలో రానా-మిహికా బజాజ్ జంటను చూసిన నెటిజెన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. లైక్స్ మరియు షేర్స్ తో వైరల్ చేస్తున్నారు. వీరి పెళ్లి జరిగి రెండు రోజులు అవుతున్నా సోషల్ మీడియాలో సందడి అసలు తగ్గలేదు. 
 
ఇక కోరుకున్న ప్రేయసిని భార్యగా చేసుకున్న రానా, అనేక మూవీ షూటింగ్స్ పూర్తి చేయాల్సివుంది. తెలుగులో దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో చేస్తున్న విరాట పర్వం మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దర్శకుడు గుణశేఖర్ హిరణ్యకశ్యప పేరుతో రానా తో ఓ భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కించనున్నారు. ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఓ తమిళ చిత్రంలో నటించాల్సివుండగా, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం.