రమ్యక్రిష్ణనా మజాకా... హీరోయిన్స్ ని మించిన రెమ్యునరేషన్

Ramyakrishna shocking remuneration
Highlights

రమ్యక్రిష్ణానా మజాకా... హీరోయిన్స్ ని మించిన రెమ్యునరేషన్

'బాహుబలి' సినిమాలో 'శివగామి' పాత్ర .. అప్పటివరకూ రమ్యకృష్ణకి గల క్రేజ్ ను రెండింతలు చేసింది. దాంతో ఇటు తెలుగు నుంచి అటు తమిళం నుంచి కీలకమైన పవర్ ఫుల్ రోల్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస సినిమాలతో ఆమె ఫుల్ బిజీ అయ్యారు. కథలో బరువైన .. బలమైన లేడీ కేరక్టర్ ఉందనగానే వెంటనే రమ్యకృష్ణను సంప్రదించేస్తున్నారు. ఆమె ఎంత పారితోషికాన్ని అడిగినా వెనకడుగు వేయకుండగా ఇచ్చేస్తున్నారు.

 కాగా, ప్రస్తుతం రమ్యకృష్ణ ప్రధాన పాత్రగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆమె వరుసగా 25 రోజులు డేట్స్ ఇచ్చారట. రోజుకి 6 లక్షల చొప్పున ఆమె ఈ 25 రోజులకి కలుపుకుని కోటిన్నర తీసుకున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రోజువారీ పారితోషికం తీసుకునేవారిలో రమ్యకృష్ణే ముందున్నారని అంటున్నారు. 

loader