తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జయలలిత మరణం అనంతరం పుట్టగొడుగుల్లా ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. అలాగే ఆమె జీవిత ఆధారంగా బయోపిక్ లు రెడీ అవుతున్నాయి. వెబ్ సిరీస్ కూడా సిద్దమవుతున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. రమ్యకృష్ణ ఒక వెబ్ కంటెంట్ లో  జయలలిత పాత్రలో కనిపించబోతున్నారు. 

మొదటి లుక్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ ఓ వర్గం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే జయలలిత సినిమా కెరీర్ కి సంబందించిన కాంట్రవర్సీ విషయాలను ఈ వెబ్ సిరీస్ లో పెద్దగా టచ్ చేయాడం లేదట. ఎక్కువగా దర్శకుడు గౌతమ్ మీనన్ ఆమె పొలిటికల్ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ గా చూపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. 

ఇక త్వరలో ట్రైలర్ విడుదల చేసిన అంచనాలను పెంచాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కంగనా రనౌత్ కూడా జయలలితకు సంబందించిన మరో బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను దర్శకుడు ఏఎల్.విజయ్ తెరకెక్కిస్తుండగా కె. విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు.