`రిపబ్లిక్‌` చిత్రంలో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. 

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం `రిపబ్లిక్‌`. దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. 

Scroll to load tweet…

ఇక విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో `తప్పూ ఒప్పులు లేవు. అధికారం మాత్రమే శాశ్వతం` అని చెబుతోంది రమ్యకృష్ణ. మొత్తంగా ఆమె పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ లీడర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చూడనటువంటి రోల్‌లో ఆమె కనిపించబోతున్నట్టు టాక్‌. మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ కనిపించనున్నాడని టాక్‌. 

ఈ సినిమాని జె.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్‌ పతాకాలపై జె.భగవాన్‌,జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 4న విడుదల కానుంది. సాయితేజ్‌ సరసన ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక రమ్యకృష్ణ ఇప్పుడు స్పెషల్‌ పవర్‌ఫుల్‌ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. `బాహుబలి`లో రాజమాతగా నటించినప్పటి నుంచి అత్యంత శక్తివంతమైన పాత్రలు ఆమెని వరిస్తున్నారు. అందులో భాగంగానే `రిపబ్లిక్‌`లోనూ అంతే పవర్‌ ఫుల్‌ రోల్‌లో కనిపించనుందని టాక్‌.