Asianet News TeluguAsianet News Telugu

మరో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ?

  • బాహుబలిలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ
  • నారా రోహిత్ బాలకృష్ణుడు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రమ్యకృష్ణ
  • రాజకీయ నాయకుడి భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందని ప్రచారం
ramyakrishna in powerful role again

రమ్యకృష్ణ ఈ పేరు వినగానే అందరికీ శివగామి, నీలాంబరి వంటి పాత్రలు గుర్తుకు రావడం సహజం. ఆయా పాత్రల్లో ఆమె నటించారు అనే కంటే.. ఆ పాత్రలకు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు.

తన కెరియర్ లో ఎన్నో గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ.. ఈ చిత్రాలతోనే రమ్యకృష్ణకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. అయితే.. ఇలాంటి మరో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనువిందు చేయనుందనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న బాలకృష్ణుడు సినిమాలో రాయలసీమకు చెందిన ఓ దివంగత రాజకీయ నేతకు భార్యగా రమ్యకృష్ణ కనిపించనుందట. రాయలసీమ ఫ్యాక్షన్, పాలిటిక్స్ నేపథ్యంలోనే రూపొందుతున్న బాలకృష్ణుడు సినిమాలో రమ్యకృష్ణ పోషిస్తున్న పాత్ర ఇంచుమించు దివంగత నేత పరిటాల రవీంద్ర భార్య, ప్రస్తుత ఏపీ మంత్రి పరిటాల సునీత జీవితాన్ని పోలి వుంటుందంటున్నాయి సినీవర్గాలు. వాస్తవానికి బాలకృష్ణుడు సినిమాకు పరిటాలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ.. ఇందులో రమ్యకృష్ణ పాత్ర మాత్రం ఇంచుమించు పరిటాల సునీత రియల్ లైఫ్‌కి దగ్గరిగా వుంటుందనేది వారి అభిప్రాయం.

ప్రముఖ రాజకీయ నేత అయిన తన భర్త హత్య అనంతరం అతడి స్థానంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అక్కడి ప్రాంత రాజకీయాలని శాసించే స్థాయికి ఎదిగిన మహిళ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందట. రమ్యకృష్ణ పాత్రను బాగా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆమె నటనే హైలైట్ గా నిలుస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios