- Home
- Entertainment
- Madhuri Dixit: స్టార్‌డమ్ వదిలేసి భర్త కోసం సాధారణ గృహిణిగా మారిన ఎవర్‌గ్రీన్ హీరోయిన్.. ఆమె అమెరికా రహస్యాలు
Madhuri Dixit: స్టార్‌డమ్ వదిలేసి భర్త కోసం సాధారణ గృహిణిగా మారిన ఎవర్‌గ్రీన్ హీరోయిన్.. ఆమె అమెరికా రహస్యాలు
Madhuri Dixit: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సాధారణ గృహిణిగా మారిపోయారు. అమెరికాలో ఆమె గడిపిన జీవితం, ఎదుర్కొన్న సంఘటనల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న మాధురీ దీక్షిత్
మాధురీ దీక్షిత్.. ఈ పేరు వినగానే ఆమె అందం, అద్భుతమైన యాక్టింగ్, డ్యాన్స్ గుర్తొస్తాయి. 'సాజన్', 'హమ్ ఆప్ కే హై కౌన్', 'దిల్', 'రామ్ లఖన్' లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆమె సొంతం. అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మాధురి పెళ్లి తర్వాత భర్త డాక్టర్ శ్రీరామ్ నెనెతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యారు. స్టార్‌డమ్ పక్కనపెట్టి, ఒక సాధారణ గృహిణిలా జీవితాన్ని ప్రారంభించారు. ఆమె రోజూ ఉదయాన్నే లేచి భర్త కోసం వంటగదిలో బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసేవారట. మాధురీ దీక్షిత్ జీవితానికి సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆమె ఏం చేసేవారంటే?
సాధారణ గృహిణిగా మాధురి!
మాధురి సిమీ గరేవాల్ చాట్ షోలో ఈ విషయాలను స్వయంగా పంచుకున్నారు. ఆమె ఉదయాన్నే నిద్రలేవడం నుంచి భర్తకు టిఫిన్ చేయడం వరకు.. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకునేవారు. ఆమె తన వైవాహిక జీవితం, కుటుంబ బాధ్యతల గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడటం అదే తొలిసారి. మాధురి అమెరికాలో తన జీవితం గురించి చెబుతూ.. `నా భర్త సర్జరీలకు వెళ్లేటప్పుడు, నేను ఉదయం 5:30 కే లేచి ఆయనకు బ్రేక్‌ఫాస్ట్ చేసేదాన్ని. ఆయన పనికి వెళ్లాక నేను మళ్లీ కాసేపు పడుకునేదాన్ని. ఆ జీవితంలోని ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేశాను` అని మాధురి చెప్పుకొచ్చారు.
మాధురి పర్సనల్ లైఫ్..
మాధురి 1999 అక్టోబర్ 17న దక్షిణ కాలిఫోర్నియాలో డాక్టర్ శ్రీరామ్ నెనెను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. ఈ దంపతులకు 2003లో అరిన్ అనే బాబు పుట్టాడు. రెండేళ్ల తర్వాత 2005లో రెండో కొడుకు ర్యాన్ జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మాధురి.. 2007లో 'ఆజా నచ్లే' సినిమాతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సినిమాలు, టెలివిజన్ రంగంలో తనకంటూ మళ్లీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓటీటీలో రిలీజైన 'మా బెహన్' సినిమాలో కూడా ఆమె నటించారు.
షోలో మనసు విప్పిన తార
మాధురి సిమీ గరేవాల్ షోలో డాక్టర్ శ్రీరామ్ నెనె గురించి తనకు బాగా నచ్చిన విషయాలను పంచుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీళ్లిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు, మాధురి ఒక పెద్ద స్టార్ అని శ్రీరామ్ నెనెకు అస్సలు తెలియదట. ఆయన ఆమె సినిమాలు ఒక్కటి కూడా చూడలేదట. ఇతరులకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను అనే నా గుణం ఆయనకు బాగా నచ్చిందని మాధురి ఒకసారి చెప్పారు. ప్రస్తుతం మాధురీ దీక్షిత్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ఆమె వెండితెర నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వరకు తన టాలెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

