త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా..రమ్యశ్రీ

First Published 24, Feb 2018, 5:18 PM IST
Ramya Sri To Enter Politics
Highlights
  • రమ్యశ్రీ  తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయమైన నటి
  • దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న రమ్యశ్రీ.
  • త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించి వార్తల్లోకి వచ్చింది.
     

 

రమ్యశ్రీ.. ఐటెం సాంగ్స్.. వ్యాంప్ క్యారెక్టర్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయమైన నటి. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న రమ్యశ్రీ.. నటిగా అవకాశాలు ఆగిపోయాక డైరెక్షన్ కూడా చేపట్టింది. తనే ప్రధాన పాత్రలో నటిస్తూ ‘మల్లి’ అనే సినిమాను డైరెక్ట్ చేసింది. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. ఆ తర్వాత లైమ్ లైట్లో లేకుండా పోయిన రమ్యశ్రీ.. ఇప్పుడు తాను త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించి వార్తల్లోకి వచ్చింది.

తనకు రాజకీయాలపై ముందు నుంచి ఆసక్తి ఉందని.. తనకు అవకాశం లభిస్తే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలన్నది తన అభిమతమని రమ్యశ్రీ చెప్పింది. ఈ మధ్య సినిమాల్లో నటించడం తగ్గినప్పటికీ తాను జనాలకు చేరువగానే ఉన్నానని.. తన పేరుతో ఫౌండేషన్ పెట్టి సేవా కార్యక్రమాలుచేపడుతున్నానని.. నాలుగేళ్లుగా పలు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. జయసుధ.. జయప్రద.. రోజా.. విజయశాంతి.. హేమ లాంటి ఎంతోమంది సినీ తారలు రాజకీయారంగేట్రం చేశారు. వీళ్లలో కొందరు విజయవంతమయ్యారు. ఐతే పెద్ద స్థాయి హీరోయిన్లు తప్పితే మిగతా వాళ్లు రాజకీయాల్లో రాణించిన దాఖలాలు లేవు. మరి రమ్యశ్రీ వచ్చి ఏం చేస్తుందో చూడాలి. అసలు ఆమెను ఆహ్వానించే పార్టీ ఏది?

loader