బిగ్ బాస్ సీజన్ 3 కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన తన 60వ పుట్టినరోజు వేడుకల కోసం స్పెయిన్ వెళ్లారు. అక్కడే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షోపై పలు సందేహాలు నెలకొన్నాయి.

వీకెండ్‌ ఎపిసోడ్స్‌ షూటింగ్‌ శనివారం ఉదయం నుండి రాత్రి వరకు సాగుతుంది. రెండు రోజులకు సంబంధించిన షూట్‌ను ఒక్క రోజులోనే పూర్తి చేస్తారు. కానీ నాగార్జున మాత్రం ఇంకా ఇండియాకి రాకపోవడంతో ఈ వారం స్పెషల్ గెస్ట్ తో షో హోస్ట్ చేయించాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో మొదట నానితో హోస్ట్ చేయించాలని అనుకున్నా.. ఆయన ఇండియాలో లేకపోవడంతో ఆలోచనలో పడ్డారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఫైనల్ గా  సీనియర్ నటి రమ్యకృష్ణను రంగంలోకి దింపారు.

దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. 'ఇదే నా మాట.. నా మాటే శాశనం' అంటూ బిగ్ బాస్ షో స్టేజ్పైకి ఎంట్రీ ఇచ్చేసింది రమ్య కృష్ణ. మరి ఈరోజు ఆమె తన స్కిల్స్ తో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి!