అల వైకుంఠపురంలో మూవీతో బన్నీ మెమరబుల్ హిట్ అందుకున్నారు.  దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత వచ్చిన అల్లు అర్జున్ ఇండస్ట్రీ కొట్టడంతో పాటు నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన అల వైకుంఠపురంలో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్ తో పాటు, పూజ గ్లామర్ మరియు బన్నీ అద్బుత నటన భారీ విజయం సాధించడంలో దోహదం చేశాయి. 

కాగా వీటన్నిటికీ మించి థమన్ సాంగ్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. చాలా కాలం తరువాత థమన్ బెస్ట్ ఆల్బమ్ అందిచడం జరిగింది. మూవీలోని అన్ని సాంగ్స్ ఆదరణ దక్కించుకోవడం విశేషం. సామజవరగమనా, బుట్ట బొమ్మా, రాములో రాములా సాంగ్స్ యూత్ ని ఊపేశాయి. అల వైకుంఠపురంలో సాంగ్స్ మేనియా బాలీవుడ్ వరకు పాకింది. 

ఇక యు ట్యూబ్ లో వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకోవడం జరిగింది. ముఖ్యంగా బుట్ట బొమ్మా సాంగ్ 300 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. కాగా అల వైకుంఠపురంలో చిత్రంలోని మాస్ బీట్ రాములో రాములా సాంగ్ కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సాంగ్స్ కూడా 200 మిలియన్ మార్క్ ని దాటి వేసింది. అలాగే 1 మిలియన్ లైక్స్ కి పైగా సొంతం చేసుకుంది.