జీఎస్టీ వివాదంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై పోలీసు కేసు నేపథ్యంలో.. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వర్మ సామాజిక కార్యకర్తలు దేవి, మణిలు పెట్టిన కేసులో... రామ్ గోపాల్ వర్మ పోలీస్ విచారణకు కూడా హాజరయ్యాడు.

 

అయితే... జీఎస్టీ వివాదంలో పోలీసు విచారణ అనంతరం రామ్ గోపాల్ వర్మ మరోసారి పోలీసుల విచారణకు హాజరు కానున్నారని ఓ వార్తా ఛానెల్ కథనం ప్రసారం చేసింది. అయితే ఆ ఛానెల్ ప్రసారం చేసిన వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, నాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని టీవీ9పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.