పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసేవారిలో కత్తి మహేష్ తర్వాతి స్థానం రామ్ గోపాల్ వర్మదే అనటంలో సందేహం అస్సలు అక్కర్లేదు. తన దృష్టికి ఎవరు వస్తే వాళ్లే.. ఎనీ టైమ్ ఎనీ సెంటర్.. జ్ఞాపకం వస్తే చాలు... అమాంతంగా పొగిడేయడం.. లేదంటే సెటైర్లతో వాతలు పెట్టేయడం వర్మకు మామూలే. అజ్ఞాతవాసి సినిమా ట్రయిలర్ చూసినప్పుడు పొగడ్తలతో ముంచెత్తిన ఆర్జీవీ ఇప్పుడు సినిమా చూసొచ్చి పవన్ కళ్యాణ్ పై ఓ రేంజిలో సెటైర్లు వేశాడు. అది కూడా ఇండైరెక్ట్ గా గతంలో ఫ్లాపైన పులి సినిమాను గుర్తు చేస్తూ ఈసారి సెటైర్లు వేశాడు.

 

పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ మూవీ పులి. ఆర్జీవీ సోషల్ మీడియాలో లేటెస్ట్ గా పెట్టిన పోస్టులో అజ్ఞాతవాసి మూవీని ఇన్ డైరెక్ట్ గా ‘పులి’ సినిమాతో పోలుస్తూ పంచ్ వేశాడు. ‘‘నేనిప్పుడే ఓ పులిని చూశాను. కాకుంటే గోళ్లు లేని పంజా లేని పులిని ఇంతవరకు చూడనేలేదు. కానీ పులి చారలు ఎలా మార్చుకుందో తెలియక తెగ ఆశ్చర్యం కలుగుతోంది. అన్నింటికన్నా దూకాల్సిన పులి పాకుతుండటం మాత్రం షాకింగ్ గా ఉంది’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.భారీ బడ్జెట్ తో.. క్రేజీ కాంబినేషన్ తో తెరకెక్కి ఎన్నో అంచనాల మధ్య రిలీజైన అజ్ఞాతవాసి అభిమానులను అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. అది రామ్ గోపాల్ వర్మని మరీ నిరాశపరిచినట్టుంది. అందుకే అభిమానులు గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడని పులిని గుర్తు చేసి మరీ ట్వీట్ పెట్టాడు. అసలే అజ్ఞాతవాసి పేలవంగా ఉందని బాధపడే ఫ్యాన్స్ కు ఆర్జీవీ ట్వీట్ చూస్తే గోరుచుట్టుపై రోకటిపోటు సామెత గుర్తుకు రాక మానదు.