వర్మా సింగిల్ ఎక్స్ ఏమైంది. జయకుమార్ చెప్పిందే నిజమా?

First Published 1, Feb 2018, 8:55 PM IST
ramgopal varma single x postponed to copy for gst
Highlights
  • జీఎస్టీ కథ కాపీ కొట్టాడంటూ వర్మపై ఆరోపణలు
  • ఆరోపణలు చేసిన రచయిత జయకుమార్
  • గతంలో జయకుమార్ కథను సింగిల్ ఎక్స్ గా తెరకెక్కిస్తానన్న వర్మ
  • సింగిల్ఎక్స్ వాయిదా వేసి కథ కాపీ కొట్టి జీఎస్టీ తీశాడా?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మల్కోవాతో తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ బూతు సినిమాలల కేటగిరీలోనే ఓ కొత్త రకం సినిమాగా క్రేజ్ పొందింది. ఏదో ఫిలాసఫీ అంటూ.. నూలు పోగు లేకుండా పోర్న్ స్టార్ అంగాంగ ప్రదర్శన చేస్తూ.. తన ఫిలాసఫీ అంటూ నాలుగు ముక్కలు వర్మ స్టయిల్లో చెప్పి ఏదో చెప్పింది అనిపించుకుని... ఏం చెప్పింది.. మ్యూజిక్ మాత్రం అలా ఎక్కడికోతీసుకెళ్లింది అనిపించింది.

 

అయితే వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ప్రకటించకముందే దాదాపు రెండేళ్ల క్రితం “సింగిల్ ఎక్స్” అనే పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ పై రచయిత జయకుమార్ అని కూడా వుంది. అయితే ఆ మూవీ ఏమైందో ఇంకా తెలియరాలేదు. ఓ స్త్రీని ప్యాంటీలో బ్యాక్ సీట్ అదోలా కనిపించేలా చాలా హాట్ గా తీసిన పిక్ తో ఆ పోస్టర్ డిజైన్ చేయించాడు వర్మ. అందులోనూ ఆ పోస్టర్ పై వర్మ పేరు ఆ అమ్మాయి తొడపై నుంచి మొదలై.. పిరుదులపై ముగుస్తుంది. ఈ పోస్టర్ తో తన కసిని చాటిన వర్మ సింగిల్ ఎక్స్ మూవీ మాత్రం తీయలేదు.

 

రచయిత జయకుమార్ చెప్తున్నట్లు మియాతో తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఈ సింగిల్ ఎక్స్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే సినీ రంగానికి సంబంధించి మోస్ట్ ట్రస్టెడ్ సైట్ ఐఎండీబీలోని వివరాల ప్రకారం వర్మ ప్రకటించిన సింగిల్ ఎక్స్ చిత్రం పోస్టర్ లో రచయిత జయకుమార్ అని స్పష్టంగా వుంది. మరి ఆ మూవీ ఎందుకు మూలన పడిందో తెలియదు కానీ... తాజాగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అయిన.. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పై మాత్రం... జయకుమార్ ఆరోపణలు చేస్తున్నాడు.

 

ఐఎండీబీలో వివరపాల ప్రకారం సింగిల్ ఎక్స్ రచయిత జయకుమార్ అయినప్పుడు, ఆ మూవీని వర్మ పక్కనపెట్టినప్పుడు.. అదే తరహాలో జీఎస్టీ తీసి రిలీజ్ చేసినప్పుడు జయకుమార్ కాన్సెప్ట్ కాపీ చేశాడనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. జయకుమార్ కథ తోనే.. కాన్సెప్ట్ డెవలప్ చేసి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తెరకెక్కించాడని అంటున్నారు. మరి వర్మ దీనిపై ఎలా స్పందిస్తాడో... సింగిల్ ఎక్స్ చిత్రం ఎప్పుడు తెరకెక్కిస్తాడో.. తనే చెప్పాలి.

 

loader