విమర్శిస్తే కొజ్జానా, వీళ్లనా సర్కారు నంది కమిటీలో పెట్టింది : వర్మ

ramgopal varma serious on nandi awards committee
Highlights

  • నంది అవార్డుల కమిటీపై రాంగోపాల్ వర్మ విమర్శలు
  • కమిటీ సభ్యులకు ఆస్కార్ ఇవ్వాలంటూ  ఎద్దేవా
  • వర్మ కు బూతులతో రిప్లై ఇచ్చిన.కమిటీ సభ్యుడు మద్దినేని రమేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను బూతులు తిడుతూ దర్శకుడు మద్దినేని రమేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూ, రాంగోపాల్ వర్మపై మండిపడ్డాడు. రామ్‌గోపాల్ వర్మ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ తీవ్రంగా స్పందించాడు.

 

కుటుంబ సభ్యులతో చీకొట్టించుకున్నాడని, అయినా బుద్ధి తెచ్చుకోలేదని విమర్శించాడు. అది చూసిన వర్మ దానిపై స్పందించారు. రమేష్ వ్యాఖ్యలను యథావిధిగా పోస్ట్ చేయడమే కాకుండా దానికి తన రిప్లైని జత చేశారు. ఆ రిప్లైలో... ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుంది. అలాగే నేను నంది అవార్డులు ఇచ్చిన వైనంపై స్పందించాను. దానికి సమాధానంగా గౌరవనీయమైన అవార్డ్ కమిటీ మెంబరు మద్దినేని రమేష్ బాబు కింది విధంగా స్పందించారు.

 

నిజానికి పోస్ట్ లో భయంకరమైన బూతులు వాడిన మద్దినేని తర్వాత దాన్ని ఎడిట్ చేసారు. అయితే ఆయన ఎడిట్ చేయటానికి ముందే దాన్ని స్క్రీన్ షాట్ తీసిన వర్మ దాన్ని తన వాల్ మీద పోస్ట్ చేసాడు.

 

సెక్యూరిటీ లేకుండా బయట తిరగలేని బతుకు బతుకుతున్నాడని నిప్పులు చెరిగాడు. బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపు గాల్లకీ బఫూన్ గాల్లకీ అంటూ నంది అవార్డుల ఎంపిక విధానాన్ని విమర్శించిన బన్నీ వాసు, నల్లమలపు బుజ్జి, బండ్ల గణేశ్ తదితరులనూ వదల్లేదు. బన్నీ గాళ్ళు అంటూ అల్లు హీరోలనీ, బుజ్జిగాళ్ళూ అంటూ నల్లమలుపు బుజ్జి నీ, బండ్లగాళ్ళూ అంటూ నిర్మాత బండ్ల గణేష్ నీ.. ప్రస్తావిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ మీదనే వర్మ బాగా సీరియస్ అయాడు.

 

నన్ను తిట్టినందుకు నాకేం బాధ లేదు... కానీ ఇలాంటి వ్యక్తులని అవార్డ్ కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు. అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలి.

వర్మ చెప్పేది నిజమే మరి.. అవార్డులు పారదర్శకంగా ఇస్తే.. విమర్శించేవాళ్లని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది.

loader