అవకాశం దొరికినప్పుడల్లా మెగా హీరోలపై ట్విట్టర్ లో తెగ విమర్శలు చేసిన వర్మ తాజాగా ట్విటర్ నుంచి వైదొలగిన రామ్ గోపాల్ వర్మ సర్కార్ 3 ఇచ్చిన షాక్ తో అనవసర విషయాల జోలికెల్లొద్దనే నిర్ణయం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా సృష్టించిన ఇష్యూలు అన్నీ, ఇన్నీ కావు. ట్విట్టర్‌ వేదికగా తనకు నచ్చిన వారిని టార్గెట్ చేసే వర్మ అందరికన్నా ఎక్కువగా మెగాహీరోలను విపరీతంగా విమర్శించేవాడు. అయితే ఇటీవలే ట్విట్టర్‌ నుంచి వర్మ నిష్క్రమించాడు. ఇలా నిష్క్రమించడానికి గల కారణం వివరించిన వర్మ మెగా హీరోల విషయంలోనూ తన ట్విట్టర్ ల గురించి చెప్తూ తప్పు తనదేనని అంగీకరించాడు.

‘నేను ట్విట్టర్‌ ద్వారా ఎవరినైతే టార్గెట్‌ చేయాలనుకున్నానో, వాళ్లు నాకు బోర్‌ కొట్టారు. అలాగే నేను వాళ్లపై చేసే ట్వీట్లు కూడా బోర్‌ కొట్టాయి. అందుకే ట్విట్టర్‌ నుంచి బయటకు వచ్చేశా. ఇక, మెగా హీరోల విషయంలో తప్పంతా నాదే. ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు కానీ.. అది అవతలి వ్యక్తి మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు. అది ఆలస్యంగా తెలిసి బుద్ధి వచ్చింద’ని చెప్పాడు వర్మ.

మరి వర్మకు మళ్లీ బుద్ధి పుట్టి ట్టిట్టర్ లో కూత పెడతాడో లేక ఇది ఇలాగే కంటిన్యూ చేస్తాడో చూడాలి.