జీఎస్టీపై సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదు నేపథ్యంలో 160 నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచిన పోలీసులు, రెండు సార్లు స్కిప్ చేసి ఇవాళ విచారణకు హాజరైన వర్మ

తన లాయర్ తోపాటు విచారణకు హాజరు

తాజాగా 41నోటీసు ఇవాళ ఇచ్చి పంపిన పోలీసులు..

సామాజిక కార్యకర్త దేవి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఎఫ్.ఐ.ఆర్ నమోదు, విచారణ

ఫిర్యాదులో ఆడవాళ్లను అసభ్యకరంగా చిత్రీకరించారని, జీఎస్టీ ఆర్ట్ అంటూ తన అభిప్రాయాలు చెప్తుంటే కించచపరిచారని వర్మపై దేవి ఫిర్యాదు.

వర్మ జీఎస్టీ భారత దేశంలోని చట్ట ప్రకారం అబ్సీన్ అంటున్న పోలీసులు.

మహిళల దుర్వినియోగం, ఆడవాళ్లను కించపరిచినట్లుగా కేసు నమోదు చేశామన్న పోలీసులు

జీఎస్టీని ఆన్ లైన్ లో డైరెక్ట్ చేశానన్న వర్మ... ఫోటోల్లో వున్నాడని అడగ్గా... పోలండ్ లో వేరే సినిమా తీస్తున్నప్పుడు వెళ్లానన్నారు. సినిమా తీసిందంతా అమెరికన్ కంపెనీ అన్న వర్మ... తతనకు ఏమీ పారితోషికం ఇవ్వలేదన్నారు.

అంతే కాక వర్మ గతంలో... జాతీయ చిహ్నంలోని స్లోగన్ మార్చి సత్యమేయ జయతే అని రాసిన నేపథ్యంలో... దానిపైనా విచారణ

ఇక ఓ ఏడాది, రెండేళ్లు శిక్ష పడ్డ కేసులున్నాయి.

జీఎస్టీని స్కైప్ లో డైరెక్ట్ చేశానన్నారు. అతని లాప్ టాప్ సీజ్ చేశాం. ఫోరెన్సిక్ పంపి రిపోర్ట్ వచ్చాక.. మళ్లీ విచారిస్తాం అని పోలీసులు తెలిపారు.

వర్మ విచారణ అడిషనల్ సీపీ రణధీర్ నేతృత్వంలో జరుగుతోంది. విడియోకు తాను క్రియేటివ్ పర్పస్ మాత్రమే బాధ్యుడినని, తీసీందంతా అమెరికా సంస్థ అని, అయితే దాన్ని అమెరికా నుంచి అప్ లోడ్ చేశానని వర్మ అంటున్నాడు. అందువల్ల ఇక్కడి చట్టాలు వర్తించవని వర్మ వాదన. మరి ఈ కేసు ఎటు మళ్లుతుందో, ఎన్ని ఆసక్తికకర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

గమనిక- ఆఫర్ల కోసం వాళ్లే పడుకుంటామని ఆఫర్లిస్తారట.. కాస్టింగ్ కౌచ్ పై ఏక్తా కపూర్ ఏమందో తెలుసా..  క్రింద లింక్ క్లిక్ చేయండి

http://telugu.asianetnews.com/entertainment/ekta-kapoor-sensational-comments-on-casting-couch