నాలుగు గోడల మధ్య జరిగే శృంగారాన్ని సినిమాగా తీస్తారా అంటూ రామ్ గోపాల్ వర్మ జీఎస్టీపై మహిళా సంఘాలు, సంప్రదాయవాదులు మండిపడుతుంటే వీరికి ఇంత కాలం ధీటుగా బదులిస్తూ వచ్చాడు వర్మ. తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు, తిట్లు, ఆందోళనలు, కేసులతో చిర్రెత్తుకొచ్చిందో ఏమో గాని... వర్మ ఏకంగా జీఎస్టీ 2 సినిమాను బహిరంగ ప్రదేశంలోనే చిత్రీకరిస్తానని ప్రకటించేశాడు.

 

జీఎస్టీ సినిమాను యూరప్ లో షూట్ చేసినట్లు గానే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ 2ను... అద్భుతమైన ముత్యాల దీవిలో మెత్తటి ఇసుక తిన్నెల మీద షూట్ చేస్తానని ప్రకటించారు. చిత్ర నిర్మాణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. అయితే ఈ సినిమాను మియామాల్కోవాతో నిర్మిస్తారా లేదంటే ఆమెను మించిన అందగత్తెను ప్రేక్షకులకు పరిచయం చేస్తారా అనేది వేచి చూడాలి. 

సమాజం ద్వారా అణిచివేయబడ్డ స్త్రీలోని సహజమైన శృంగార భావాలను జీఎస్టీ సినిమాలో చిత్రీకరించిన వర్మ... మరి ఈసారి ఏ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని జీఎస్టీ 2 నిర్మిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కిందటి సారి మియామాల్కోవా అందాలకు కిరవాణి సంగీతం జతకలిసి రక్తి కట్టించింది. మరి ఈసారి ఎవరు సంగీతాన్ని అందిస్తారనేది కూడా హాట్ టాప్ గా మారింది.