వంగవీటి’ కోసం తనదైన శైలిలో ప్రమోషన్లు మొదలుపెట్టేశాడు రామ్ గోపాల్ వర్మ సినిమాను హైప్ చేసేందుకు స‌రికొత్త ప్లాన్ వేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌ శివ టు వంగవీటి’ పేరుతో  ప్రత్యేక కార్యక్రమం నిర్వ‌హిస్తున్న వ‌ర్మ‌  


సినిమాపై ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. ఇక సినిమా రిలీజ్ ముంగిట మరింతగా సినిమాను వార్తల్లో నిలబెట్టడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేశాడు వర్మ.‘శివ టు వంగవీటి’ పేరుతో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 20వ తేదీన ఒక ప్రత్యేక కార్యక్రమం జరగ‌బోతోంది. ఇది రామ్ గోపాల్ వర్మ జర్నీ నేపథ్యంలో సాగే కార్యక్రమమట. 

విజయవాడ నుంచి నాగార్జున దగ్గరికి.. అక్కడి నుంచి అమితాబ్ దగ్గరికి తన ప్రయాణం ఎలా సాగిందో వివరించి.. చివరగా ‘వంగవీటి’ సినిమా మీద ఫోకస్ పెడతాడట వర్మ ఈ కార్యక్రమంలో. తనకు బ్రేక్ ఇచ్చిన నాగార్జున.. తాను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని వర్మ వెల్లడించాడు.

 ఈ ముగ్గురూ ఒక వేదిక మీదికి వస్తే ఆ కార్యక్రమం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘వంగవీటి’ ప్రమోషన్ కోసం వర్మ గొప్ప ఎత్తుగడే వేశాడని చెప్పాలి.