Asianet News TeluguAsianet News Telugu

వర్మ జీఎస్టీ చూడాలంటే... ఏం చేయాలి, ఆన్ లైన్ లో ఫ్రీ నా కాదా..?

  • రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన జీఎస్టీ-గాడ్ సెక్స్ అండ్ ట్రూత్
  • ఈ మూవీ రిలీజ్ ఈ జనవరి 26నే..
  • ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్న ఈ మూవీకి టికెట్ కూడా..
ramgopal varma fixed tickets for gst god sex and truth

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్&ట్రూత్ తో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేయాలని వర్మ యోచిస్తున్నారు. కేవలం థియేటర్‌లో ఆడే సినిమాలకే కాదు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసే సినిమాల ద్వారా కూడా కలెక్షన్ల వర్షం కురిపించవచ్చని వర్మ నిరూపించబోతున్నారట. జీఎస్‌టీ తోనే ఆయన ఈ ఫీట్ చేసి చూపించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. జీఎస్‌టీని వర్మ ఆన్‌లైన్ లోనే(వీమియో వెబ్ సైట్) రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాను 'ఫ్రీ'గా చూసేద్దామనుకున్నవాళ్లకు మాత్రం నిరాశ తప్పదేమో. ఎందుకంటే ఆన్‌లైన్ లోనూ టికెట్ పెట్టి మరీ సినిమా చూపించబోతున్నారట వర్మ.

  

ఆన్‌లైన్ రూ.150 టికెట్ రేటు ఫిక్స్ చేసి సినిమాను వదలబోతున్నారట. సినిమా పట్ల ఉన్న బజ్ రీత్యా మంచి మంచి కలెక్షన్స్ వస్తాయన్న ఉద్దేశంతోనే ఇలా టికెట్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. అయినా.. ఇంటర్నెట్ లో ఫ్రీగా పోర్న్ దొరుకుతుంటే.. అంత డబ్బు పెట్టి 'జీఎస్‌టీ 'ని ఎవరైనా చూస్తారా? అన్న అనుమానం కూడా కలగకమానదు. ఎలాగూ థియేటర్స్ లో రిలీజ్ చేసే సినిమా కాదు కాబట్టి.. ఇలాగైనా ఎంతో కొంత డబ్బు రాబట్టవచ్చనేది వర్మ ప్లాన్ గా తెలుస్తోంది. ఒకవేళ ఐడియా సక్సెస్ అయితే దిమ్మతిరిగే స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదే జరిగితే వర్మకు ఇక తిరుగుండదు. ఇప్పుడు తనను విమర్శిస్తున్నవాళ్లందరికీ ఆ కలెక్షన్స్ ను చూపించి సమాధానం చెబుతాడు.

  

అయితే 'జీఎస్‌టీ'కి వర్మ టికెట్ ఫిక్స్ చేయబోతున్నారన్న ప్రచారంలో నిజమెంత అనేది మాత్రం తెలియడం లేదు. ఒకవేళ ఆర్జీవి నిజంగా టికెట్ పెట్టాలనుకుంటే.. ముందే చెప్పి ఉండేవారు కదా.. అనేది కొంతమంది అభిప్రాయం. షాక్ లు ఇవ్వడం ఆర్జీవికి అలవాటే కాబట్టి.. రేపు ఉదయం వర్మ అదే పని చేయబోతున్నారని మరికొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా జీఎస్‌టీ విడుదలైతే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

  

రిలీజ్ కు ముందే తీవ్ర చర్చను లేవనెత్తిన 'జీఎస్‌టీ'పై.. ఆ తర్వాత ఎంత చర్చ జరుగుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. వర్మ దీన్నో బోల్డు ఫిలిం తరహాలో చిత్రీకరించారా?.. లేక తాను చెప్పినట్లు 'వుమెన్ లిబరేషన్' ఫిలాసఫీకే పెద్ద పీట వేశారా? అన్నది జీఎస్‌టీ రిలీజ్ అయితే గానీ చెప్పలేం. ఏదేమైనా గణతంత్ర దినోత్సవ వేళ.. వర్మ అందరి మైండ్స్‌ను అటువైపు తిప్పేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios