Asianet News TeluguAsianet News Telugu

రాంగోపాల్ వర్మను కదిలించిన శ్రీదేవి హఠాన్మరణం

  • శ్రీదేవి మృతిపై వర్మ స్పందన
  • గంటకో ట్వీట్ తో తన బాధ వెళ్లగక్కిన వర్మ
  • తన ట్వీట్స్ లో ఓ హృద్యమైన రీట్వీట్ కవిత
ramgopal varma deep sorrow for sridevi demise

నిత్యం ఏదో ఒక వివాదంతో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ.. అసలు మనిషేనా.. అతడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవా.. వర్మకు రక్త తరిత్రల తప్ప ప్రేమానురాగాలు, ఆప్యాయతలు గిట్టవా.. శ్రీదేవి మరణం వరకూ వర్మ గురించి చాలా మందిలో ఇలాంటి అభిప్రాయమే ఉండేది కాని అతిలోక సుందరి తిరిగిరానిలోకాలకు చేరడంతో వర్మ తానెంతగా చింతిస్తున్నాడో గంటకో ట్వీట్ తో తెలుపుతున్నాడు. అందాల తార శ్రీదేవి మ‌ర‌ణం వ‌ర్మని ఎంత‌గా క‌లిచి వేస్తుందో ఆయ‌న రోజు చేస్తున్న ట్వీట్స్‌ని బ‌ట్టి తెలుస్తుంది. తాజాగా శ్రీదేవిపై లక్ష్మీభూపాల అనే అభిమాని రాసిన కవితను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు రామ్ గోపాల్ వర్మ.

అమ్మా శ్రీదేవీ.. నాలుగేళ్ల వయసులో బాల్యాన్ని కోల్పోయావ్... అమ్మానాన్నల్ని బిడ్డల్లా పోషించావ్.. అంటూ మొదలైన ఈ కవితలో ప్రతిఅక్షరంలోనూ చాలా పెయిన్ కనిపిస్తుంది. శ్రీదేవి జీవితంలో ఎన్ని విదార‌క సంఘ‌ట‌న‌లు దాగి ఉన్నాయో అంటూ సాగిన ఆ ట్వీట్‌ ను వర్మ రీట్వీట్ చేసి తన బాధను, దుఃఖాన్ని తెలియజేశారు వర్మ.

 

Follow Us:
Download App:
  • android
  • ios